చిక్కుల్లో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్, నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిన ఢిల్లీ కోర్టు, హరిద్వార్ లో ‘దాక్కున్న రెజ్లర్’ ?
23 ఏళ్ళ రెజ్లర్ మృతితో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ చిక్కుల్లో పడ్డాడు. ఢిల్లీకోర్టు అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇతనితో బాటు మరికొందరు నిందితులకు కూడా ఈ విధమైన వారెంట్లు జారీ అయ్యాయి.
23 ఏళ్ళ రెజ్లర్ మృతితో ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ చిక్కుల్లో పడ్డాడు. ఢిల్లీకోర్టు అతనికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇతనితో బాటు మరికొందరు నిందితులకు కూడా ఈ విధమైన వారెంట్లు జారీ అయ్యాయి. ఈ నెలారంభంలో సుశీల్ కుమార్ కు చెందిన స్టేడియం వద్ద కొంతమంది ఘర్షణకు దిగారు. ఆ గొడవలో సాగర్ రాణా అనే రెజ్లర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించాడు. ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ కొడుకే అతడని తెలిసింది. మొదట వారెవరో తనకు తెలియదని బుకాయించిన సుశీల్ కుమార్ ఆ తరువాత పరారయ్యాడు. అతనికోసం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. స్టేడియం వద్ద గొడవకు దిగినవారు పోలీసులకు ఇచ్చిన తమ స్టేట్ మెంట్లలో…ఈ క్లాషెస్ లో సుశీల్ కుమార్ ప్రమేయం ఉందని చెప్పినట్టు వెల్లడైంది. అంటే రెజ్లర్ సాగర్ రాణాపై సుశీల్ కుమార్ అతని సహచరులు దాడి చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఇలా ఉండగా సుశీల్ కుమార్ హరిద్వార్ లోని ఓ ఆశ్రమంలో దాక్కున్నట్టు ‘దైనిక్ జాగరణ్’ డైలీ వెల్లడించింది. ఆ ఆశ్రమంలో ఓ యోగా గురు ఉన్నాడని ఈ పత్రిక తెలిపింది. మరోవైపు నిందితుల్లో ఒకడైన దలాల్ అనే వ్యక్తి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వీడియోలో.. ఆ నాడు జరిగిన దాడిలో సుశీల్ కుమార్ కూడా పాల్గొన్నట్టు స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఖాకీలు ఇతడిని అరెస్టు చేసేందుకు హరిద్వార్ వెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. లోగడ రెండు పతకాలు సాధించి ఇండియాకు కీర్తిని తెచ్చిపెట్టిన ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ ఇలా ఎక్కడో దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: ‘మా కుటుంబంలో అందర్నీ కోల్పోయాం’ గాజా సిటీలో ఓ కుటుంబ పెద్ద ఆవేదన, ఇజ్రాయెల్ బాంబుల వర్షంలో ఆల్-జజీరా కార్యాలయం ధ్వంసం
Ananya Nagalla: సోషల్ మీడియలో విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకుంటున్న వకీల్ సాబ్ ఫేమ్ అనన్య.. ( వీడియో )