Secunderabad Cantonment Board Jobs: కంటోన్నెంట్ బోర్డ్ కోవిడ్ ఆసుప‌త్రిలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..

Secunderabad Cantonment Board Jobs: క‌రోనా వ్యాప్తి అడ్డుక‌ట్ట వేయ‌డానికి పెద్ద ఎత్తులో వైద్య సంబంధిత ఉద్యోగుల‌ను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే దేశంలోని చాలా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు...

Secunderabad Cantonment Board Jobs: కంటోన్నెంట్ బోర్డ్ కోవిడ్ ఆసుప‌త్రిలో ఉద్యోగాలు.. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక‌..
Scb Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: May 15, 2021 | 9:00 PM

Secunderabad Cantonment Board Jobs: క‌రోనా వ్యాప్తి అడ్డుక‌ట్ట వేయ‌డానికి పెద్ద ఎత్తులో వైద్య సంబంధిత ఉద్యోగుల‌ను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే దేశంలోని చాలా ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో భారీ ఎత్తున ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సికింద్రాబాద్‌లోని కంటోన్నెంట్ బోర్డ్ ఆధ్వ‌ర్యంలోని కోవిడ్ ఆసుప‌త్రిలో ప‌లు ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా మొత్తం 35 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

భ‌ర్తీ చేయ‌నున్న ఉద్యోగాలు, అర్హ‌త‌..

* ఈ నోటిఫికేష‌న్‌లో భాగంగా.. జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్‌, డ్యుటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్, సూప‌ర్‌వైజ‌ర్‌, న‌ర్సింగ్ ఇన్‌ఛార్జి, న‌ర్సింగ్ స్టాఫ్‌, ఫార్మ‌సిస్ట్‌, ఫ్లెబొటొమిస్ట్ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* జ‌న‌ర‌ల్ ఫిజిషియ‌న్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌, ఎండీ (జ‌న‌ర‌ల్ మెడిసిన్‌) ఉత్తీర్ణ‌త సాధించ‌డంతో పాటు సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి.

* డ్యుటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణ‌తో పాటు అనుభ‌వం ఉండాలి.

* ఇక సూప‌ర్‌వైజ‌ర్ పోస్టుల‌కు న‌ర్సింగ్ ఉత్తీర్ణ‌తగా నిర్ణ‌యించారు.

* న‌ర్సింగ్ ఇన్‌ఛార్జిల‌కు బీఎస్సీ న‌ర్సింగ్‌/ జీఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.

* న‌ర్సింగ్ స్టాఫ్ బీఎస్సీ న‌ర్సింగ్ / జీఎన్ఎం ఉత్తీర్ణ‌త‌తోపాటు అనుభ‌వం కూడా ఉండాలి.

* ఫార్మ‌సిస్ట్ పోస్టుల‌కు ద‌రఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు డీఫార్మా/బీఫార్మాలో ఉత్తీర్ణ‌త సాధించాలి.

* ప్లెబొటొమిస్ట్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నీషియ‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం కూడా ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు వ‌య‌సు 55 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఈ-మెయిల్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ద‌ర‌ఖాస్తులు మే 09న ప్రారంభం కాగా.. చివ‌రితేదీగా మే 17, 2021గా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: Puri Jagannadh : పూరీ చెప్పిన మంచిమాట.. జంతువులు పుడతాయి, బతుకుతాయి, చనిపోతాయి…కానీ

Small Savings: జూలై నెల నుంచి చిన్న పొదుపు పధకాల వడ్డీ రేట్లు తగ్గించే దిశలో బ్యాంకులు..

Director S. Shankar: తిరిగి పట్టాలెక్కనున్న ఇండియన్ 2 మూవీ.. మరి రామ్ చరణ్ సినిమా పరిస్థితేంటి…