DSSB Recruitment 2021: ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. 7వేల‌కు పైగా ఖాళీలు..

DSSB Recruitment 2021: నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిట‌రీ ఢిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం 7236...

DSSB Recruitment 2021: ఢిల్లీ స‌బార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్‌లో ఉద్యోగాలు.. 7వేల‌కు పైగా ఖాళీలు..
Dssb Recruitment
Follow us
Narender Vaitla

|

Updated on: May 15, 2021 | 8:25 PM

DSSB Recruitment 2021: నేష‌న‌ల్ క్యాపిట‌ల్ టెరిట‌రీ ఢిల్లీ ప్ర‌భుత్వానికి చెందిన ఢిల్లీ సబార్డినేట్ స‌ర్వీసెస్ సెల‌క్ష‌న్ బోర్డ్ ప‌లు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. మొత్తం 7236 పోస్టుల‌తో భారీగా ఉద్యోగాల నియామ‌కం చేప‌ట్ట‌నుంది.

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు..

* టీజీటీ విభాగంలో 6258 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ పోస్టుల‌ను భర్తీ చేయ‌నున్నారు. ఇందులో భాగంగా హిందీ, నేచుర‌ల్ సైన్స్‌, మ్యాథ్స్‌, సోష‌ల్ సైన్స్‌, బెంగాలీ స‌బ్జెక్టులో ఉద్యోగుల‌ను తీసుకోనున్నారు. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఏ(ఆన‌ర్స్), బ్యాచిల‌ర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు సీటెట్‌లో అర్హ‌త సాధించి ఉండాలి.

* ప్రైమ‌రీ, న‌ర్సరీ విభాగాల్లో మొత్తం 628 అసిస్టెంట్ టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తో పాటు న‌ర్సరీ టీచ‌ర్ ఎడ్యుకేష‌న్ ప్రోగ్రాంలో డిప్లొమా/ స‌ర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

* జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్ (278) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు మెట్రిక్యులేష‌న్/ సెకండ‌రీ స్కూల్ ఎగ్జామినేష‌న్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 35 ప‌దాలు, హిందీలో 30 ప‌దాలు టైపింగ్ స్పీడ్ నైపుణ్యం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 18-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

* కౌన్సెల‌ర్ (50) పోస్టుల‌కు అప్లై చేసుకునే అభ్య‌ర్థులు.. సైకాల‌జీ/ అప్లైడ్ సైకాల‌జీలో బ్యాచిల‌ర్స్ డిగ్రీతో పాటు కౌన్సెలింగ్ సైకాల‌జీలో పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 30 ఏళ్లు మించ‌కూడ‌దు.

* ప‌ట్వారీ (10) పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి. కంప్యూట‌ర్ ప్రొఫిషియ‌న్సీతో పాటు ఉర్దూ/ హిందీలో పని అనుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌సు 21-27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* పైన తెలిపిన ఖాళీల‌కు అభ్య‌ర్థుల‌ను వ‌న్ టైర్‌/ టూ టైర్ ఎగ్జామినేష‌న్ స్కీం, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

* ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ప్రారంభ తేదీ 25.05.2021 కాగా.. 24.06.2021 చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి.

Also Read: Humanity : అనాధ ముస్లిం మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన తాడేపల్లిగూడెం సీఐ

దాతృత్వం చాటుకున్న క్రిప్టోకరెన్సీ ఎథెరియం వ్యవస్థాపకుడు..భారత కోవిడ్ రిలీఫ్ ఫండ్‌కు 1.1 బిలియన్ డాలర్ల సహాయం

HOUSEWISE SURVEY: కరోనా కట్టడికి సర్వే వ్యూహం… తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. ఫలితమిచ్చేనా?

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు