HOUSEWISE SURVEY: కరోనా కట్టడికి సర్వే వ్యూహం… తెలంగాణ బాటలో ఏపీ సర్కార్.. ఫలితమిచ్చేనా?
ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రతీ రోజు 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త కేసుల సంఖ్య తగ్గడం లేదు. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగానే కనిపిస్తోంది.
HOUSEWISE SURVEY IN ANDHRA PRADESH: ఏపీలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ప్రతీ రోజు 20 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా కొత్త కేసుల సంఖ్య తగ్గడం లేదు. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. కరోనా వచ్చిన వారు ఐసోలేషన్లో వుండకుండా.. నిబంధనలను బేఖాతరు చేస్తూ తిరగడం వల్లనే కొత్తగా మ్యూటెంట్ అయిన కరోనా వేగంగా విస్తరిస్తోందని ప్రభుత్వం భావించింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం బాటలో ఏపీ ప్రభుత్వం కూడా ఇంటింటి సర్వేకు సిద్దమైంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జ్వరంతో బాధపడుతూ అనేక మంది ఇంట్లోనే ఉంటూ కుటుంబీకులకు వైరస్ వ్యాపించేందుకు కారణమవుతున్నారు. దీంతో ప్రతి ఇంటికి వెళ్లి జ్వరంతో బాధపడుతున్నవారి వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయిలో కరోనా నియంత్రణకు ఇంటింటా కొవిడ్ ఫీవర్ సర్వే చేస్తున్నారు. నేటి నుంచి జ్వరాలపై ఇంటింటి సర్వే ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర అధికారులు, జిల్లా వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఇంటింటి సర్వేపై దిశా నిర్ధేశం చేశారు.
సర్వేలో భాగంగా వలంటీర్లు, ఆశా కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరిగి జ్వరపీడితులను గుర్తిస్తారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలుంటే ఆ విషయాన్ని సంబంధిత ఏన్‌ఎన్‌ఎంకు తెలియజేస్తారు. వారికి కేటాయించిన 50 ఇళ్లకు వెళ్లి ఆ సర్వే చేస్తారు. సర్వే బృందాల పని తీరును తనతో పాటు జిల్లా యంత్రాంగం మానిటరింగ్ చేస్తుంది. అంతేకాకుండా వివరాలను ఎప్పటికప్పుడు వలంటీర్ల యాప్‌లోనూ అప్‌లోడ్ చేస్తారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారిని అవసరాన్ని బట్టి కోవిడ్ కేర్ సెంటర్‌లో గానీ, ఆస్పత్రిలో గానీ చేర్పిస్తారు. కరోనా లక్షణాలేవీ లేని వారిని, ప్రైమరీ కాంటాక్ట్‌లో ఉన్న వారిని, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వారిని 14 రోజుల వరకు హోం క్వారంటైన్‌లో ఉంచుతారు. వారికి అవసరమైన మందుల కిట్ ఇచ్చి ఏఎన్‌ఎం ద్వారా పర్యవేక్షణ చేస్తారు. జర్వ పీడితులను గుర్తించి అక్కడికక్కడే మందులు, కరోనా కిట్లు అందజేయనున్నారు. దీనివల్ల కరోనాను కట్టడి చేయడమే కాక, ఆస్పత్రులపై ఒత్తడి కూడా తగ్గనుంది. ప్రతి ఒక్కరూ ఫీవర్ సర్వేకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు వేగవంతం చేసేలా అడుగులు వేస్తోంది. అదే విధంగా.. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల జారీ చేశారు. దీంతో ప్రత్యామ్నాయాలను అన్వేషించి ఆక్సిజన్ నిల్వలను పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అదనపు ఆక్సిజన్‌ను జిల్లాల్లో అత్యవసరాల కోసం నిల్వ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.
ALSO READ: వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు తొలగిన అడ్డంకి.. శభాష్ దోవల్ జీ..!
ALSO READ: వేళ్ళూనుకుంటున్న ఆన్‌లైన్ టెర్రరిజమ్.. టెక్కీల సాయంతో అంతానికి అగ్రరాజ్యం స్కెచ్