RBI Recruitment 2021: ఆర్‌బీఐ గౌహతిలో ఉద్యోగ ప్రకటన… రోజుకు రూ.2000 వేలకు మించకుండా వేతనం

RBI JOB notification: గౌహతిలోని ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఫార్మసిస్ట్ పోస్టు భ‌ర్తీకి అర్హత, ఆస‌క్తి ఉన్నఅభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానాలు కోరుతోంది.

RBI Recruitment 2021: ఆర్‌బీఐ గౌహతిలో ఉద్యోగ ప్రకటన... రోజుకు రూ.2000 వేలకు మించకుండా వేతనం
Follow us
Sanjay Kasula

|

Updated on: May 15, 2021 | 10:12 PM

RBI JOB Notification: గౌహతిలోని ఆర్‌బీఐ జాబ్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఫార్మసిస్ట్ పోస్టు భ‌ర్తీకి అర్హత, ఆస‌క్తి ఉన్నఅభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌కు ఆహ్వానాలు కోరుతోంది. ఈ నోటిఫికేష‌న్‌లో ఒకే ఒక్క పోస్టు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నోటిఫికేషన్‌ను శుక్రవారం 14 మే న విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగానికి కొన్ని నిబంధనలను ప్రకటించింది. రోజులో కొన్ని గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. ఆ పనిచేసిన గంటలకు మాత్రమే వేతనంను చెల్లిస్తారు. గంటకు రూ. 400. ఎంపికైన అభ్యర్థి సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 7:30 నుండి ఉదయం 10 గంటల వరకు ఆర్‌బిఐ స్టాఫ్ క్వార్టర్స్ కాంప్లెక్స్‌లో పని చేయాల్సి ఉంటుంది. అతను సోమవారం నుండి శుక్రవారం మధ్య అన్ని రోజులలో మధ్యాహ్నం 1:30 నుండి 4 గంటల వరకు మెయిన్ ఆఫీస్ ప్రామిసెస్ డిస్పెన్సరీలో పనిచేయవలసి ఉంటుంది.

ఫార్మసిస్ట్ రోజుకు గరిష్టంగా ఐదు గంటలు పని చేయాల్సి ఉంటుంది. రోజువారీ వేతనం రూ .2,000 మించకూడదు అనేది నిబంధన. కాంట్రాక్టు ఉద్యోగంలో ఎటువంటి ప్రోత్సాహకాలు లేదా భత్యాలు ఉండవు.

ముఖ్యమైన విష‌యాలు..

* పైన తెలిపిన పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే అభ్య‌ర్థులు ఫార్మసీలో డిప్లొమా పొంది ఉండాలి.

* అభ్య‌ర్థుల‌ను డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ సాధారణ దశలను అనుసరించవచ్చు:

దశ 1: https://rbi.org.in/home.aspx వెబ్‌సైట్‌ను సందర్శించండి

దశ 2: హోమ్‌పేజీలో ‘రిక్రూట్‌మెంట్ సంబంధిత ప్రకటనలు’ అనే లింక్‌పై క్లిక్ చేయండి

దశ 3: క్రొత్త పేజీ తెరవబడుతుంది. సూచనలను జాగ్రత్తగా చదవండి, ఆపై ‘కాంట్రాక్ట్ బేసిస్‌పై ఫార్మసిస్ట్ పోస్టుకు దరఖాస్తు’ పై క్లిక్ చేయండి

దశ 4: దరఖాస్తు ఫారం తెరవబడుతుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసి ప్రింటౌట్ తీసుకోండి

దశ 5: ఫారమ్ నింపి సర్టిఫికెట్ల ఫోటోకాపీలను అటాచ్ చేయండి

దశ 6: నింపిన ఫారమ్‌ను ‘రీజినల్ డైరెక్టర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానవ వనరుల నిర్వహణ విభాగం, నియామక విభాగం, స్టేషన్ రోడ్, పన్‌బజార్, గువహతి 781 001’ కు పంపండి.

దరఖాస్తు ఫారమ్‌కు ప్రత్యక్ష లింక్ ఇక్కడ ఉంది:

https://rbidocs.rbi.org.in/rdocs/content/pdfs/PHAR12052021_AN.pdf

దరఖాస్తు ఫారం జూన్ 3 న లేదా అంతకు ముందు పైన పేర్కొన్న చిరునామాకు చేరుకోవాలి. ఫారం ఆధారంగా, ఇంటర్వ్యూ కోసం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.

Also Read: Vaccination: వ్యాక్సిన్‌ ముఖం చూడని దేశాలెన్నో…ధనికదేశాలే వాటిని ఆదుకోవాలి..డబ్ల్యూహెచ్వో సూచన!

ప్రతి నెలా రూ. 248 జమ చేసుకోండి..ఆ తర్వాత 5 వేల పెన్షన్ తీసుకోండి..ఇలా చేస్తే పదవీ విరమణ తరువాత డబ్బుకు సమస్య ఉండదు

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు