Vaccination: వ్యాక్సిన్‌ ముఖం చూడని దేశాలెన్నో…ధనికదేశాలే వాటిని ఆదుకోవాలి..డబ్ల్యూహెచ్వో సూచన!

Vaccination: కరోనా కల్లోలంలో ఆశాదీపం కోవిడ్ టీకా. ప్రపంచమంతా ఈ మహమ్మారిని పూర్తిగా తుడిచేయడానికి వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్లలో 83 శాతం ధనిక దేశాల ప్రజలకే అందుబాటులో ఉంది.

Vaccination: వ్యాక్సిన్‌ ముఖం చూడని దేశాలెన్నో...ధనికదేశాలే వాటిని ఆదుకోవాలి..డబ్ల్యూహెచ్వో సూచన!
Vaccination
Follow us
KVD Varma

|

Updated on: May 14, 2021 | 9:50 PM

Vaccination: కరోనా కల్లోలంలో ఆశాదీపం కోవిడ్ టీకా. ప్రపంచమంతా ఈ మహమ్మారిని పూర్తిగా తుడిచేయడానికి వ్యాక్సిన్ పైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇప్పటివరకూ ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న కరోనా వ్యాక్సిన్లలో 83 శాతం ధనిక దేశాల ప్రజలకే అందుబాటులో ఉంది. దీంతో పేద దేశాల పట్ల ధనిక దేశాలు కనికరం చూపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది. కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న అనేక ఆఫ్రికా దేశాలు ఇప్పటికీ వ్యాక్సిన్ మొహం చూసి ఎరగని పరిస్థితి నెలకొని ఉందని డబ్ల్యూహెచ్వో చెబుతోంది. ఈ పరిస్థితులపై ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దుస్ధితిలో ఉన్న పేద దేశాలను ధనిక దేశాలు ఆదుకోవాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధోనామ్ గెబ్రెయేషన్ చెబుతున్నారు. వ్యాక్సిన్ ప్రక్రియలో అసమానత్వం వల్ల పేద దేశాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ వచ్చిన వెంటనే సంపన్న దేశాలే వ్యాక్సిన్ తీసేసుకుంటాయని డబ్ల్యూహెచ్వో మొదటి నుంచి చెబుతూనే ఉంది. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. వ్యాక్సిన్ రాకముందు నుంచి ముందస్తు ఆర్డర్లు ఇవ్వడం ద్వారా ధనిక దేశాలు వ్యాక్సిన్ సమీకరణలో ముందుకెళ్లిపోతున్నాయి. దీంతో పేద దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. పేద దేశాలను నిర్లక్ష్యం చేస్తే కరోనా వైరస్ ను సమూలంగా నిర్మూలించడం సాధ్యం కాదనే విషయాన్ని అందరూ గుర్తించాలని సూచిస్తోంది డబ్ల్యూహెచ్వో. ఆ సంస్థ చెబుతున్న లెక్కల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకూ దాదాపు 140 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి జరగ్గా, ఇందులో దాదాపు 100 కోట్ల డోసులు 10 దేశాలలోని ప్రజలకే లభించాయి.

వివిధ దేశాలలో వ్యాక్సినేషన్‌ తీరు, ఆ దేశ జనాభాలో ఎంత మందికి వ్యాక్సిన్ అందిందో  చూద్దాం…

దేశం దేశ జనాభా    వ్యాక్సినేషన్‌            జనాభాలో ఎంతమందికి                                                   (కోట్లలో)          పొందినవారు                 వ్యాక్సినేషన్‌ %                                                                               (కోట్లలో) 1. చైనా                                        144                        35.4                                 25.3 2. అమెరికా                                   33                        26.4                                   80 3. భారతదేశం                            138                        17.6                                    13 4. బ్రిటన్‌                                     6.7                          5.4                                  79.1 5. బ్రెజిల్‌                                   21.2                          4.8                                  22.6 6. జర్మనీ                                     8.3                           3.6                                 43.3 7. ఫ్రాన్స్‌                                     6.7                            2.6                                  39 8. టర్కీ                                      8.4                            2.5                                  29.7 9. ఇజ్రాయిల్‌                            0.90                         0.54                                 60 10.బహ్రెయిన్‌                           0.17                         0.14                                82.3

పై దేశాలలో అత్యధిక దేశాలు అభివృద్ధి చెందిన లేదా అభివృద్ది చెందుతున్న దేశాలే కావడం గమనార్హం. 90 లక్షల జనాభా కల ఇజ్రాయిల్‌ దాదాపు కోటి డోసుల కరోనా టీకాలను కొనుగోలు చేసి పెట్టుకుంది. అంటే… ఆ దేశ జనాభాలో ప్రతి ఒక్కరికీ కనీసం ఒక్క డోసు టీకా అందుబాటులో ఉంది. 5.86 కోట్ల జనాభా కల దక్షిణాఫ్రికాలో టీకా పొందిన వారు మొత్తం కేవలం 9 లక్షలు. అంటే… దేశ జనాభాలో కేవలం 1.5 శాతం మంది మాత్రమే ఇప్పటి వరకూ కనీసం ఒక్క డోసు టీకా పొందగలిగారు. 4.5 కోట్ల జనాభా కలిగిన ఉగాండా వంటి పేద దేశం 4.2 లక్షల మందికి మాత్రమే టీకాను ఇవ్వగలిగింది. అంటే… ఉగాండా జనాభాలో కనీసం ఒక్క శాతం మందికి కూడా ఇప్పటి వరకూ టీకా అందలేదు

మరికొన్న ఆఫ్రికా దేశాలు, ఇతర దేశాలలో ఇంత వరకూ టీకా కార్యక్రమమే మొదలు కాలేదనేది నమ్మశక్యంకాని నిజం. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన టీకాలలో ఆఫ్రికా ఖండం మొత్తంనికి అందుబాటులోకి వచ్చినవి కేవలం ఒక్క శాతం టీకాలు మాత్రమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం కనీసం 12 దేశాలకు ఇంత వరకూ ఒక్క డోసు టీకా కూడా లభ్యం కాలేదు. ఇందులో అధికభాగం చాడ్ , బుర్కినా ఫాసో, బురుండి, ఎరిట్రియా, టాంజానియా వంటి ఆఫ్రికా దేశాలే ఉన్నాయి. ఇప్పటికీ కనీస స్థాయిలో వ్యాక్సినేషన్‌ అందుబాటులోకి రాని దేశాలలో కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్న డబ్ల్యూహెచ్వో.. దీన్ని నివారించడానికి ధనిక దేశాలే చొరవ తీసుకోవాలని కోరుతోంది.

Also Read: Sputnik V: గుడ్ న్యూస్.. మరో వారంలో స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అందుబాటులోకి.. ధర ఎంతో తెలుసా.?

పెద్ద కొడుకు అంత్యక్రియలు చేసొచ్చిన తండ్రికి మరో షాక్‌! అసలు ఏం జరిగిందంటే.!!