Iron Dome: ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలో ఐరన్ డోమ్ ఓ అద్భుతం.. ఇది ఎలా పనిచేస్తుందంటే..
Iron Dome: శత్రువుతో పోరాటం ఒక ఎత్తయితే, అక్కడి నుంచి వచ్చే దెబ్బలను కాచుకోవడం మరో ఎత్తు. అదే ముఖ్యం కూడాను. యద్ధంలో దాడులు చేయడం ఎంత అవసరమో.. శత్రువు కొట్టే దెబ్బను తగలకుండా చూసుకోవడం అత్యంత అవసరం.
Iron Dome: శత్రువుతో పోరాటం ఒక ఎత్తయితే, అక్కడి నుంచి వచ్చే దెబ్బలను కాచుకోవడం మరో ఎత్తు. అదే ముఖ్యం కూడాను. యద్ధంలో దాడులు చేయడం ఎంత అవసరమో.. శత్రువు కొట్టే దెబ్బను తగలకుండా చూసుకోవడం అత్యంత అవసరం. అదే యుద్ధనీతి కూడానూ. అందులో ఆరితేరిపోయింది ఇజ్రాయిల్. యుద్ధాలు చూసీ..చూసీ.. పోరాటాలు చేసీ, చేసీ యుద్ధతంత్రంలో ముఖ్యమైన సెల్ఫ్ డిఫెన్స్ (స్వయం రక్షణ) మంత్రాన్ని బాగా నేర్చుకుంది. దానికోసం ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ఆ దేశం. అదే ఐరన్ డోమ్. ఐరన్ డోమ్ అంటే ఎదో ఇనప కట్టడం అనుకోకండి. అదొక ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థ. శత్రువు గాలిలో ప్రయోగించే.. రాకెట్లను గాలిలోనే పేల్చేసే అద్భుతమైన డిఫెన్స్ సిస్టం.
ఏమిటీ దీని ప్రత్యేకత..
ఐరన్ డోమ్ ఇజ్రాయిల్ 2011లో ఏర్పాటుచేసుకున్న గగనతల రక్షణ వ్యవస్థ. గాజాలోని హమస్ తీవ్రవాదులు ప్రయోగించే రాకెట్ల నుంచి తన దేశ పౌరులను రక్షించడంలో ఐరన్ డోం వ్యవస్థదే కీలక పాత్ర. శత్రుదేశం ప్రయోగించిన క్షిపణులు, రాకెట్లను గగనతలంలోనే అడ్డుకునే వ్యవస్థ ఇది. ఇజ్రాయిల్ కంపెనీలు రాఫెల్ అడ్వాన్స్ డ్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఈ ప్రాజెక్టులో అమెరికా ఇజ్రాయిల్ కు సాంకేతిక, ఆర్థిక సహకారమందించింది.
ఎలా పనిచేస్తుంది?
శత్రువులు రాకెట్ ప్రయోగించగానే..ఐరన్ డోమ్ రాడార్ వ్యవస్థ తక్షణమే స్పందించి రాకెట్ మార్గం, దాని లక్ష్యాన్ని గుర్తించి ప్రమాద తీవ్రతను తెలియచేస్తుంది. ఒకవేళ రాకెట్ ఇజ్రాయిల్ లోని జనావాసాలపై పడుతుందని తేలితే.. రాకెట్ ను గాల్లోనే అడ్డుకుని గాల్లోనే పేల్చివేసే శక్తి ఈ వ్యవస్థ సొంతం. అదే రాకెట్ ఖాళీ ప్రదేశంలో పడుతుంది అని తెలిస్తే దాని మానాన దానిని విదిచిపెట్టేస్తుంది. అది ఈ వ్యవస్థకున్న మరో ప్రత్యేకత.
రెండు భాగాల ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థ..
ఇందులో రెండు రక్షణ వ్యవస్థలు ఉంటాయి. డేవిడ్స్ స్లింగ్ క్షిపణి వ్యవస్థ మొదటిది. కాగా, రెండోది ‘ఆరో’ వ్యవస్థ. డేవిడ్ స్లింగ్ వ్యవస్థను గతంలో మ్యాజిక్ వాండ్ గా పిలిచేవారు. తక్కువ ఎత్తులో వచ్చే బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునేందుకు రూపొందించినది ‘డేవిడ్ స్లింగ్ క్షిపణి వ్యవస్థ’. ‘ఆరో వ్యవస్థ’ కూడా ఆంటి బాలిస్టిక్ మిసైల్ వ్యవస్థ. హైపర్ సోనిక్ ఆరో ఆంటి మిసైల్ ఇంటర్ సెప్టెర్లను కలిగివున్నఉమ్మడి వ్యవస్థ.
ఆరో వ్యవస్థలో కీలక విభాగాలేవంటే…
- క్షిపణుల ఇంటర్ సెప్టర్ వ్యవస్థ ఎల్టా ఈఎల్/ఎం-2080- గ్రీన్ పైన్
- శత్రుదేశాల క్షిపణులను పసిగట్టి ముందస్తుగా అప్రమత్తం చేసే హెచ్చరిక వ్యవస్థ ‘ఏఈఎస్ఏ రాడార్
- అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలతో కూడిన గోల్డన్ సిట్రాన్ కమాండ్ సెంటర్
- ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ కు చెందిన ‘బ్రౌన్ హేజిల్ నట్’ లాంచ్ కంట్రోల్ కేంద్రం
- ఈ వ్యవస్థను ఒక ప్రదేశం నుంచి ముందుగా సిద్ధం చేసిన మరో ప్రదేశానికి తరలించే వీలుంటుంది.
- ఆరో 1, 2,3 లుగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిన ఇజ్రాయిల్. ఆరో శ్రేణిలో అత్యాధునికమైన వ్యవస్థ ఆరో-3. విస్తృతమైన పరిధి, అత్యంత ఎత్తుల్లో కూడా
- రక్షణను కల్పించడానికి అభివృద్ధి చేసిన ఆంటి సాటిలైట్ ఆయుధ వ్యవస్థ దీని సొంతం. డేవిడ్ స్లింగ్, ఆరో వ్యవస్థలతో కూడిన ఐరన్ డోమ్ రక్షణ
- వ్యవస్థ శత్రుదేశాలకు చెందిన మధ్య, దీర్ఘ శ్రేణి క్షిపణి దాడులు, రాకెట్లు, డ్రోన్లు, విమానాలు, ఉపగ్రహాలను నిలువరించి నిర్మూలిస్తుంది.
రాకెట్లను ఐరనో డోమ్ ఎలా నిలువరిస్తుంది?
శత్రువుల రాకెట్లను పసిగట్టి వాటిని గాల్లోనే పేల్చివేస్తుంది. ఐరన్ డోమ్(Iron Dome) 90 డిగ్రీల కోణంలో ఉండి ఇంటర్ సెప్టర్లను ప్రయోగిస్తుంది. ఈ సమయంలో సైరన్ మోగిస్తు పౌరులను హెచ్చరిస్తుంది. ఐరన్ డోమ్ వ్యవస్థను స్థిరంగా ఒక చోట ఉంచి లేదా నిర్ణీత ప్రదేశానికి తరలించి పనిచేయించవచ్చు. తరచుగా వీటిని ఇజ్రాయిల్ సరిహద్దులకు తరలించి అక్కడ మోహరిస్తుంటారు.
ఐరన్ డోమ్ సక్సెస్ రేటు... ఐరన్ డోం ఇప్పటివరకు 90 శాతం విజయవంతమైనట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు వేలకొద్దీ శత్రుదేశాల క్షిపణులను అడ్డుకున్న ఘనత ఈ వ్యవస్థకు ఉంది.
సాఫ్ట్ వేర్ ఆధునికీకరణ… మారుతున్న పరిస్థితులు, శత్రుదేశాల సామర్థ్యం పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఐరన్ డోం వ్యవస్థను ఇజ్రాయిల్ అప్ డేట్ చేస్తూ వస్తోంది.
వేరు వేరు కంపెనీల టీకాలతో ప్రమాదం లేదు!.. బ్రిటన్‌లో జరిపిన అధ్యయనంలో ఆసక్తికర అంశాలు వెల్లడి..