AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

israel and palestine war ఈ జర్నలిస్ట్ గుండె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..

israel and palestine war: ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద..

israel and palestine war ఈ జర్నలిస్ట్ గుండె ధైర్యానికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. వీడియో చూస్తే మీరూ షాక్ అవుతారు..
Shiva Prajapati
|

Updated on: May 14, 2021 | 9:57 PM

Share

israel and palestine war: ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై రాకెట్ లాంచర్లతో దాడులకు పాల్పడగా.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు చేస్తోంది. వరుస రాకెట్ లాంచర్లను వదులుతోంది. కాగా, పాలస్తీనా నగరంపై ఇజ్రాయెల్ రాకెట్ దాడి చేస్తుండగా.. అల్ జజీరా జర్నలిస్ట్ ఆ రాకెట్ దాడిని లైవ్ రిపోర్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్ జజీరాకు చెందిన లేడీ రిపోర్టర్ ఒక భవనంపై నిలబడి యుద్ధ పరిస్ధితుల గురించి లైవ్ రిపోర్టింగ్ ఇస్తోంది. ఆ సమయంలో గజా నగరంపై ఇజ్రాయెల్ ప్రయోగించిన రాకెట్ లాంచర్ ఓ భవంతిపై పడింది. అది చూసి ఆమె షాక్ అయ్యారు. కొద్దిపాటి దూరంలోనే ఆ దాడి జరగగా.. తొలుత భయపడినా ఆ రిపోర్ట్ తన రిపోర్టింగ్‌ను అలాగే కంటిన్యూ చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు.

కాగా, ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే.. ఇజ్రాయెల్, పాలస్తీనాలు మాత్రం బాంబులతో పరస్పరం యుద్ధానికి పాల్పడుతున్నాయి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య రాకెట్ లాంచర్ల దాడులు కొనసాగుతున్నాయి. పాలస్తీనా ఉగ్రవాద ముఠా హమాస్.. ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేసింది. హమాస్ ఇప్పటివరకు 1,500 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయెల్ పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. దీంతో పాలస్తీని చిగురుటాకులా వణికిపోతోంది. అనేక భవనాలు నేలకూలాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటి వరకు 65 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు తెలుస్తోంది. అలాగే ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 11 మంది హమాస్ కమాండర్లు మరణించినట్లు తెలుస్తోంది.

Also read:

Children in Lockdown: కరోనా కల్లోలం..ఇంట్లోనే బందీలుగా బాల్యం..చిన్నారుల కోసం తల్లిదండ్రులు ఏం చేయాలంటే..

western Coalfields Limited: వెస్ట‌ర్న్ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు రేపే చివ‌రి తేదీ..

Kishan Reddy : అంబులెన్సులు ఆపడం సరికాదు.. తెలంగాణ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్న కిషన్‌రెడ్డి

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!