Kishan Reddy : అంబులెన్సులు ఆపడం సరికాదు.. తెలంగాణ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్న కిషన్‌రెడ్డి

Telangana stops ambulances : హైదరాబాద్‌ వచ్చేందుకు అంబులెన్స్‌లకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు...

Kishan Reddy : అంబులెన్సులు ఆపడం సరికాదు..  తెలంగాణ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలన్న కిషన్‌రెడ్డి
Follow us

|

Updated on: May 14, 2021 | 8:05 PM

Telangana stops ambulances : హైదరాబాద్‌ వచ్చేందుకు అంబులెన్స్‌లకు ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. ఈ విషయమై  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని చెప్పారు. కొవిడ్‌ చికిత్స కోసం ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులు ఆపడం సరైన సంప్రదాయం కాదన్న కిషన్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం, సహకారం ఉండాలన్నారు. రెండు రాష్ట్రాలు చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ప్రభుత్వం గౌరవించాలని, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులను ఆస్పత్రులకు వెళ్లనీకుండా ఆపరాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. కాగా, చికిత్స కోసం రోగులతో వెళుతోన్న అంబులెన్స్ లను తెలంగాణ సరిహద్దుల్లో నిలిపివేస్తోన్న వ్యవహారాన్ని ఏపీ సర్కారు సీరియస్ గా తీసుకుంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కొవిడ్ నిర్వహణ పై సుప్రీంకోర్టులో ఇప్పటికే కొనసాగుతోన్న విచారణ లో సైతం ఈ అంశం ప్రస్తావించాలని నిర్ణయించింది. కాగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణలోకి వస్తోన్న ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపేస్తున్న సంగతి తెలిసిందే . హైదరాబాద్ ఆస్పత్రుల నుంచి బెడ్‌ అనుమతి పత్రం, తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ పాస్‌ ఉంటేనే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీరియస్ గా ఉన్న కొవిడ్ రోగులు సహా తీవ్ర అనారోగ్యంతో ఉన్న అనేక మంది రోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Read also : YS Sharmila : కరోనాతో పెద్ద దిక్కు కోల్పోయిన తెలంగాణ ఆడ బిడ్డలకు షర్మిల అండ, “ఆపదలో తోడుగా YSSR టీం” ఏర్పాటు

Latest Articles