western Coalfields Limited: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరి తేదీ..
western coalfields limited recruitment 2021: దేశంలో ఉగ్రరూపం దాల్చుతోన్న కరోనాకు అడ్డుకట్టవేయడానికి వైద్యరంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కాంట్రాక్ట్ విధానంలో పెద్ద ఎత్తున...
western coalfields limited recruitment 2021: దేశంలో ఉగ్రరూపం దాల్చుతోన్న కరోనాకు అడ్డుకట్టవేయడానికి వైద్యరంగం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కాంట్రాక్ట్ విధానంలో పెద్ద ఎత్తున వైద్య సంబంధిత ఉద్యోగులను నియమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భారత ప్రభుత్వ రంగానికి చెందిన మినీరత్న సంస్థ వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్).. కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు..
* మొత్తం 33 పోస్టుల్లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (జీడీఎంఓ)-09, 24 స్పెషలిస్ట్ పోస్టుల ఉన్నాయి.
* జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. అభ్యర్థులు 65 ఏళ్లు మించకూడదు. ఎంపికైన వారికి నెలకు రూ. 90,000 జీతంగా చెల్లిస్తారు.
* స్పెషలిస్ట్‌లో భాగంగా.. ఫిజీషియన్, జనరల్ సర్జన్, అబ్‌స్ట్రెటిక్స్–గైనకాలజీ, పీడియాట్రీషియన్, ఆప్తల్మాలజిస్ట్, రేడియాలజిస్ట్, ఆర్థోపెడిక్ సర్జన్, ఈఎన్‌టీ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈమెయిల్/ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
* ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలనుకునే వారు పూర్తి వివరాలను hrrecruitment.wcl@-coalindia.in ఐడీకి పంపించాలి.
* ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పూర్తి వివరాలను.. జనరల్ మేనేజర్(పర్సనల్), ఎగ్జిక్యూటివ్ ఎస్టాబ్లిస్‌మెంట్ డిపార్ట్‌మెంట్, డబ్ల్యూసీఎల్, సెకండ్ ఫ్లోర్, కోల్ ఎస్టేట్, డబ్ల్యూ సీఎల్ హెడ్‌క్వార్టర్స్, సివిల్ లైన్స్, నాగ్‌పూర్, మహారాష్ట్ర–440001 చిరునామాకు పంపించాలి.
* దరఖాస్తులకు చివరి తేదీగా 15.05.2021 నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు http://www.westerncoal.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read: CBSE Exams: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తారా.? వాయిదా వేస్తారా.? మే 25న తేలిపోనుంది..