CBSE Exams: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తారా.? వాయిదా వేస్తారా.? మే 25న తేలిపోనుంది..
CBSE Exams: కరోనా మహమ్మారి పుణ్యామాని విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా మారిపోయాయి. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండడం, పరస్థితులు మళ్లీ ఎప్పుడు సాధారణ స్థితిలోకి వస్తాయో తెలియని...
CBSE Exams: కరోనా మహమ్మారి పుణ్యామాని విద్యార్థుల చదువులు అగమ్యగోచరంగా మారిపోయాయి. కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతుండడం, పరస్థితులు మళ్లీ ఎప్పుడు సాధారణ స్థితిలోకి వస్తాయో తెలియని నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు బోర్డులు తమ పరిధిలోని పరీక్షలను వాయిదా వేయడం లేదా రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇటీవలే యూపీఎస్‌సీ సైతం పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక కొన్ని రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్ విద్యార్థులను పరీక్షలు లేకుండా ప్రమోట్ చేస్తూ ప్రకటన చేశాయి. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వాహణపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. పరీక్షలు నిర్వహిస్తారా.? లేదా అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మే 25న ఈ విషయంపై ఓ స్పష్టత రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా మంది నిపుణులు కూడా కరోనా ఉధృత రూపం దాల్చుతున్నవేళ పరీక్షలను రద్దు చేయడమే ఉత్తమమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పరీక్షలను రద్దు చేస్తున్నట్లు వస్తోన్న వార్తలను సీబీఎస్ఈ ఖండించింది. మరి చర్చ జరుగుతున్నట్లు పరీక్షలను రద్దు చేస్తారా.? లేదా వాయిదా వేస్తారా.? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే మరో పది రోజులు వేచి చూడాల్సిందే.
AIIMS Gorakhpur Recruitment: గోరఖ్‌పూర్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..