South Central Railway: దక్షిణ మధ్య రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ..
South Central Railway Paramedical Posts: కరోనా మహమ్మారిని దేశం నుంచి పారదోలడానికి అంతా ఏకమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే...
South Central Railway Paramedical Posts: కరోనా మహమ్మారిని దేశం నుంచి పారదోలడానికి అంతా ఏకమవుతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ రంగ సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ రైల్వే కూడా తమ వంతి కృషి చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రైల్వే బోగీలను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకోనున్నారు.
భర్తీ చేయనున్న ఖాళీలు..
* నర్సింగ్ సూపర్‌డింటెంట్: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మూడేళ్ల జనరల్ నర్సింగ్ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. 20 ఏళ్ల నుంచి 54 ఏళ్లలోపు వారు అర్హులు.
* ల్యాబ్ అసిస్టెంట్: అభ్యర్థులు సైన్స్ విభాగంలో 10+2తో పాటు మెడికల్ లాబరేటరీ టెక్నాలజీలో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయసుల 18 ఏళ్ల నుంచి 54 ఏళ్ల లోపు ఉండాలి.
* హాస్పిటల్ అటెండంట్: ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతి లేదా ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. వయసు 18 నుంచి 54 ఏళ్లు మధ్యలో ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* కరోనా నేపథ్యంలో పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు.
* ఈ ఉద్యోగాలకు సెంట్రల్/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు/ మాజీ రైల్వే ఉద్యోగులతో పాటు ఇతరులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
* ఎంపికైన అభ్యర్థులు కోవిడ్ రోగులు చికిత్స పొందుతోన్న వార్డుల్లో సేవలు అందించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులు సికింద్రాబాద్ లాలాగూడలోని సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో పని చేయాల్సి ఉంటుంది.
* ఈ పోస్టులకు ఎంపికై వారికి మార్చి 31, 2022 వరకు పనిచేసే అవకాశం కల్పించారు.
* ఆసక్తి ఉన్న అభ్యర్థులు నేరుగా సెంట్రల్ రైల్వే ఆసుపత్రిలో సంప్రదించాల్సి ఉంటుంది.
* ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాలకు scr.indianrailways.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.