పెద్ద కొడుకు అంత్యక్రియలు చేసొచ్చిన తండ్రికి మరో షాక్‌! అసలు ఏం జరిగిందంటే.!!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ఎన్నో హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అటువంటి...

పెద్ద కొడుకు అంత్యక్రియలు చేసొచ్చిన తండ్రికి మరో షాక్‌! అసలు ఏం జరిగిందంటే.!!
Corona Deaths
Follow us
Ravi Kiran

| Edited By: Team Veegam

Updated on: May 15, 2021 | 9:37 PM

Corona Deaths In Jalalpur: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. ఎన్నో హృదయవిదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. పెద్ద కొడుక్కి అంత్యక్రియలు నిర్వహించి వచ్చేసరికి చిన్న కొడుకు కూడా మృతి చెందాడు.

జలాల్ పూర్ గ్రామంలోని అత్త‌ర్ సింగ్ అనే వ్య‌క్తికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. కొద్దిరోజుల క్రితం అన్నదమ్ములిద్దరికీ తీవ్ర జ్వరం వచ్చింది. పరిస్థితి విషమించడంతో పెద్దకొడుకు పంకజ్ మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు అతడికి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్దకుమారుడు చనిపోయాడన్న బాధను దిగమింగుకుని ఇంటికి వచ్చిన తండ్రికి మరో షాక్ తగిలింది. చిన్న కొడుకు దీపక్ కూడా అతని కళ్ల ముందే కుప్పకూలిపోయి ప్రాణాలొదిలాడు. గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఇద్ద‌రు కొడుకులు చ‌నిపోవ‌డంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

కాగా.. జలాల్ పూర్ గ్రామంలో అత్తర్‌సింగ్‌ కొడుకులే కాకుండా 14 రోజుల వ్యవధిలో 18 మంది వరకు చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. అయితే మరణించిన అన్నదమ్ములిద్దరికీ కరోనా టెస్టులు చేయించకపోవడంతో వారిద్దరూ ఆ వైరస్‌తోనే చనిపోయారా? లేక వేరే ఏదైనా కారణముందా? అన్నది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. ఆ గ్రామంలో చనిపోయినవారందరూ ముందు జ్వరంతో బాధపడ్డారని, ఆ తర్వాత ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయాయని సమాచారం.

Also Read:

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు.. పదవీ కాలం పొడిగింపు..

వాట్సాప్‏లో సీక్రెట్ చాట్ దాచుకోండిలా.. సరికొత్త సర్వీస్ అందుబాటులోకి.. వివరాలు ఇవే.!

డేంజరస్ స్టంట్స్ చేసిన కోతి.. పులులకు గట్టి షాక్.. నవ్వులు పూయిస్తున్న వీడియో.!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!