AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Small Savings: జూలై నెల నుంచి చిన్న పొదుపు పధకాల వడ్డీ రేట్లు తగ్గించే దిశలో బ్యాంకులు..

Small Savings: విస్తృత ఆర్థిక వ్యవస్థలో రుణాలు తీసుకునే వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడటానికి, స్థిరమైన వృద్ధి పథానికి తిరిగి రావడానికి ఆర్థిక. ద్రవ్య సహకారం అవసరమని నిపుణులు భావిస్తున్నారు.

Small Savings: జూలై నెల నుంచి చిన్న పొదుపు పధకాల వడ్డీ రేట్లు తగ్గించే దిశలో బ్యాంకులు..
Small Savings
Follow us
KVD Varma

|

Updated on: May 15, 2021 | 8:36 PM

Small Savings: విస్తృత ఆర్థిక వ్యవస్థలో రుణాలు తీసుకునే వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడటానికి, స్థిరమైన వృద్ధి పథానికి తిరిగి రావడానికి ఆర్థిక, ద్రవ్య సహకారం అవసరమని నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల కోత కోసం అనుకూలంగా ఉన్నాయి. ఇందులో భాగంగా చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు సుకన్య సమిద్ధి, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సి), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్), నెలవారీ ఆదాయ పథకం మరియు సీనియర్ సిటిజన్ పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించాలని ప్రతిపాదిస్తున్నారు. చిన్న పొదుపు పథకాలపై అధిక రేట్లు ఉన్నందున, విస్తృత ఆర్థిక వ్యవస్థలో రుణాలు తీసుకునే వ్యయాన్ని తగ్గించడానికి సెంట్రల్ బ్యాంక్ కష్టపడుతోంది.

ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం నిర్ణయిస్తుంది. ప్రస్తుత త్రైమాసికంలో, చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు 4-7.6% పరిధిలో నిర్ణయించారు. ఈ పథకాలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ చివరిసారిగా మార్చి 31 న 50-100 బేసిస్ పాయింట్ల రేట్లు తగ్గించింది. ఆ సమయంలో, నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ఎన్నికలకు వెళుతుండటంతొ వడ్డీ రేట్లను తగ్గించే నిర్ణయం తీసుకోలేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాలను ప్రకటించినందున ప్రభుత్వం వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకుంటుందని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. తదుపరి రేటు సమీక్ష జూన్ 30 న జరగనుంది. ఈ సమీక్షలో వడ్డీరేట్లను తాగించే అవకాశం ఉందని వారంటున్నారు.

ప్రస్తుతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం టర్మ్ డిపాజిట్ ప్లాన్ 5%, సుకన్య సమృద్దికి 7.6%, పిపిఎఫ్ కోసం 7.1%, ఎన్ఎస్సికి 6.8%, కిసాన్ వికాస్ పత్రాకు 6.9% వడ్డీ రేటును ఇస్తోంది. ఆగస్టు 2019 నుండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) రెపో రేట్లను 175 బేసిస్ పాయింట్లు తగ్గించి 4 శాతానికి తగ్గించింది, చిన్న పొదుపు పథకాలపై రాబడి 80-110 బేసిస్ పాయింట్లు తగ్గించారు.

“ఆర్బిఐ చురుకుగా కొనసాగుతుందని, ద్రవ్య పరిస్థితులు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకున్తుందనీ మేము భావిస్తున్నాము, ఇది చిన్న పొదుపు రేటు తగ్గింపుకు మద్దతు ఇవ్వాలి” అని బార్క్లేస్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ రాహుల్ బజోరియా వ్యాఖ్యానించారు. బెంచ్ మార్క్ బాండ్ రేటును 6% మార్కు చుట్టూ లేదా అంతకంటే తక్కువగా ఉంచడంపై కేంద్ర బ్యాంకు దృష్టి పెట్టింది. అలాగే, చిన్న పొదుపు రేట్ల తగ్గింపు బ్యాంకులు తక్కువ ఖర్చుతో డిపాజిట్లను పెంచడానికి సహాయపడుతుంది. అని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: RBI: ఆర్‌బీఐ షాకింగ్ నిర్ణయం….!! ఆ బ్యాంక్ లైసెన్స్ రద్దు… ( వీడియో )

9వేల రూపాయల పొదుపుకు 29 లక్షల భారీ ప్రయోజనం..! అదనంగా పన్ను మినహాయింపు.. తెలుసుకోండి..