AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. మాయదారి లిఫ్ట్ ప్రాణం తీసింది.. చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే..

ఖమ్మం నగరంలో ఉన్న ప్రసూన ప్రైవేట్ ఆసుపత్రిలో లిఫ్ట్ జారి పడి సరోజనమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముదిగొండ మండలం వనవారి కృష్ణాపురం గ్రామానికి చెందిన మహిళ గుండె సంబంధిత చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. లిఫ్ట్‌లో తీసుకుని వెళ్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడింది.

అయ్యో దేవుడా.. మాయదారి లిఫ్ట్ ప్రాణం తీసింది.. చికిత్స కోసం ఆసుపత్రికి వెళితే..
Crime News
N Narayana Rao
| Edited By: |

Updated on: Mar 22, 2025 | 5:38 PM

Share

తెలంగాణలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు సవాలు విసురుతున్నాయి. 4 వారాల్లో నాలుగు ఘటనలు జరిగాయి. తాజాగా జరిగిన ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఖమ్మం నగరంలో ఉన్న ప్రసూన ప్రైవేట్ ఆసుపత్రిలో లిఫ్ట్ జారి పడి సరోజనమ్మ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముదిగొండ మండలం వనవారి కృష్ణాపురం గ్రామానికి చెందిన మహిళ గుండె సంబంధిత చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చింది. లిఫ్ట్‌లో తీసుకుని వెళ్తుండగా ఒక్కసారిగా లిఫ్ట్ కిందపడింది. చికిత్స కోసం వచ్చిన ఆమెకు మొదటి అంతస్తులో యాంజియోగ్రామ్ నిర్వహించి స్ట్రెచర్‌పై నాలుగో అంతస్తుకు తీసుకెళ్తున్నారు బాయ్స్. అయితే కంట్రోల్ లేకుండా ఒక్కసారిగా ఫోర్త్ ఫ్లోర్‌కి వెళ్లిన లిఫ్ట్.. సడెన్‌గా కిందపడింది. దీంతో స్ట్రెచర్‌పై ఉన్న మహిళ మృతి చెందింది.

అనారోగ్యం పాలైన తమ తల్లిని ఆస్పత్రికి తీసుకువస్తే ప్రాణం పోయిందని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రమాదానికి కంటే ముందే ప్రాణప్రాయ స్థితిలో ఉన్న ఆమెకు రెండు స్టంట్స్ వేశారు. ఆ తర్వాత రెస్ట్ కోసం పై ఫ్లోర్‌కు స్ట్రెచర్‌లో తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

అయితే.. ప్రతి రోజు లిఫ్ట్ బాగానే పనిచేస్తుందని సిబ్బంది పేర్కొంటున్నారు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా ఎందుకు జరిగిందనేది సిబ్బందికి అంతుపట్టడం లేదు. నిర్వహణా లోపమా? విద్యుత్ సరఫరాలో అంతరాయమా? కారణాలేవైనా మహిళ ప్రాణాలు గాల్లో కలిశాయి. స్ట్రెచర్‌ తీసుకెళ్తున్న బాయ్ మాత్రం చాకచక్యంగా ప్రాణాలు కాపాడుకోలిగాడు.

తెలంగాణలో వారానికి ఓఘటనలో ఒకరు బలి అవుతున్నారు. లిఫ్ట్‌లు మృత్యు శకటాలుగా మారుతున్నాయనే చర్చ నడుస్తోంది. హైదరాబాద్‌లో ఇద్దరు చిన్నారులు బలయ్యారు. సిరిసిల్లలో పోలీస్‌ ఆఫీసర్‌ ప్రాణం తీసింది లిఫ్ట్‌. మేయింటేనెన్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరాన్ని వరుస ఘటనలు గుర్తుచేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..