Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PUBG Game: పబ్జ్ మొబైల్ గేమ్ అభిమానులకు శుభవార్త..సరికొత్తగా ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ రాబోతోంది..ఎప్పుడో తెలుసా?

PUBG Game: పబ్జ్ మొబైల్ గేమ్ అంటే మన దేశంలో చాలా మంది ఇష్టపడతారు. దీనిని మనదేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ గేమ్ మళ్ళీ రాబోతోంది.

PUBG Game: పబ్జ్ మొబైల్ గేమ్ అభిమానులకు శుభవార్త..సరికొత్తగా 'బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా' రాబోతోంది..ఎప్పుడో తెలుసా?
Pubg Mobile Game
Follow us
KVD Varma

|

Updated on: May 16, 2021 | 7:28 AM

PUBG Game: పబ్జ్ మొబైల్ గేమ్ అంటే మన దేశంలో చాలా మంది ఇష్టపడతారు. దీనిని మనదేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ గేమ్ మళ్ళీ రాబోతోంది. పబ్జ్ గేమ్ సరికొత్త అవతారంతో మళ్ళీ భారత్ లోకి అడుగుపెత్తబోతోంది. ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ పేరుతో త్వరలో ఇండియాలో పబ్జ్ మొబైల్ గేమ్ లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పబ్జ్ అభిమానులు ఎప్పుడు ఈ గేమ్ అందుబాటులోకి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. వారికోసం పబ్జ్ ఇండియా శుభవార్త చెప్పింది. జూన్ నెలలో పబ్జ్ కొత్త గేమ్ బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా లాంచ్ చేయబోతున్నట్టు చెప్పింది. ఈ గేమ్ కు సంబంధించి ట్రైలర్ మే 31న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన టీజర్ విడుదల చేశారు. కచ్చితమైన తేదీ ప్రకటించనప్పటికీ.. ఈ గేమ్ జూన్ నెలలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయని పబ్జ్ మొబైల్ కాస్టర్ ఓషన్ శర్మ మీడియాకు వెల్లడించారు.

“నేను ఇంతకుముందు చెప్పినట్లుగా, మేలో రెండు ప్రధాన ప్రకటనలు వస్తాయి, వాటిలో ఒకటి ఈ రోజు జరిగింది. ఇది కేవలం టీజర్ అయితే, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరిగితే ఈ నెలాఖరులోగా ట్రైలర్ రావచ్చు. జూన్ నాటికి గేమ్ అందుబాటులో ఉంటుంది ”అని టీజర్ లాంచ్ సందర్భంగా శర్మ వెల్లడించారు.

దీనిని బట్టి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా జూన్ లో ఎప్పుడైనా విడుదల కావచ్చు. అందుకు సంబంధించి ప్రీ రిజిస్ట్రేషన్లు జూన్ మొదటి వారం తెరిచే అవకాశం కనిపిస్తోంది. పబ్జ్ మొబైల్ ఇండియా ఆండ్రాయిడ్ ఐవోఎస్ రెండింటిలోనూ అందుబాటులో ఉండేది. అందువల్ల, కంపెనీ ఇదే విధమైన ధోరణిని అనుసరిస్తే, బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా రెండు ప్లాట్‌ఫామ్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. అందువల్ల, ఆండ్రాయిడ్ ఐవోఎస్ వినియోగదారులకు ప్రీ-రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉంటుందని గేమ్ నిపుణులు భావిస్తున్నారు.

పబ్జ్ గేమ్ భారతదేశం కోసం ప్రత్యేకమైన వెర్షన్ అందుబాటులోకి తీసుకువస్తున్నా.. ఆట చాలా అంశాలలో అసలు పబ్జ్ మొబైల్ మాదిరిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఏదేమైనా, ఆట యొక్క భారతీయ సంస్కరణలో ఇక్కడ ఒక చిన్న మార్పు ఉండే అవకాశం ఉంది. బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా సాన్హోక్ నుండి బాన్ తాయ్ మ్యాప్ స్థానం పోస్టర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇది గేమ్‌లో లభించే 4 × 4 మ్యాప్‌లలో ఒకటి. మ్యాప్ సాన్హోక్ 2018 సెప్టెంబర్‌లో పబ్జ్ మొబైల్‌కు జోడించారు. ఇప్పుడు యుద్దభూమి మొబైల్ ఇండియాలో భాగంగా సెట్ చేయబడింది.

కాబట్టి పబ్జ్ గేమ్ అభిమానులు ఇండియా వెర్షన్ లో ‘యుద్ధభూమి’లో తలపడటానికి సిద్ధంగా ఉండండి.

Also Read: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్..! ఒకసారి కాదు రెండుసార్లు సాధించాడు.. ఎవరో తెలుసా..?

Gurugram Police thanks to Shikhar: దాతృత్వాన్ని చాటుకున్న గబ్బర్.. కోవిడ్ బాధితులకు మరోసారి సాయం