- Telugu News Photo Gallery Cinema photos Samantha looks beautiful in a saree at an OTT award function
చీరలో సన్నజాజి తీగలా సమంత.. ఎంత బాగుందో కదా!
అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏమాయ చేశావే సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది, తర్వాత వరసగా స్టార్ హీరోల సినిమాలో ఆఫర్ కొట్టేసి తన నటనతో అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా టాలీవుడ్‌లో ఈ బ్యూటీకి స్టార్ హీరోలకు ఉండే అంత ఫ్యాన్ బేస్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు, అంతలా ఈ ముద్దుగుమ్మ తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది.
Updated on: Mar 22, 2025 | 9:04 AM

ఇక గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ చిన్నది. రెండు సంవత్సరాల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, పలు వెబ్ సిరీస్‌లు చేస్తుంది.

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్, బాలీవుడ్ పై ఫోకస్ చేసి, అక్కడే వరసగా ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక ఒకప్పుడు టాలీవుడ్‌నే షేక్ చేసిన ఈ బ్యూటీ, తెలుగులో ఇప్పుడు ఒకటి రెండు సినిమాలకే ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.

సమంత సినిమాలు ఎక్కువగా చేయకపోయినా, ఈ బ్యూటీకి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తాజాగా వచ్చిన మోస్ట్ పాపులర్ హీరోయిన్స్ జాబితాలో ఈ ముద్దుగుమ్మే మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది రీసెంట్‌గా, తన ఇన్ స్టాలో శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. ఇందులో సమంత చాలా సింపుల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది.

తాజాగా ఓటీటీ అవార్డు ఫంక్షన్‌కు అటెండ్ అయిన ఈ ముద్దుగుమ్మ శారీలో మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్.





























