- Telugu News Photo Gallery Cinema photos Latest photos of Ruhani Sharma who made a splash at Charminar
చార్మినార్‌లో రుహాని అందాల విందు.. సొగసులతో చంపేస్తుందిగా..
అందాల ముద్దుగుమ్మ రుహాని శర్మ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. తన అంద చందాలతో మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు, తాజాగా చార్మినార్ రోడ్లపై సందడి చేసింది. చీరలో అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది.
Updated on: Mar 22, 2025 | 9:49 AM

చిలసౌ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన బ్యూటీ రుహాని శర్మ. ఈ మూవీలో ఈ చిన్నది తన నటన, అందంతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో కాకుండా, తమిళంలో మంచి అవకాశాలు అందుకుంటూ పలు సినిమాలు చేసింది. అందులో కొన్ని సూపర్ హిట్ కూడా అందుకున్నాయి.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు లేకపోయినప్పటికీ తమిళంలో మాత్రం వరస ఆఫర్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

ఈ ముద్దుగుమ్మ తన సరికొత్త ఫ్యాషన్‌తో ఎప్పుడూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. ట్రెండీ డ్రెస్స్‌లోనైనా, శారీలో నైనా, హాఫ్ సారీలో నైనా ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. అంతలా తన అందాలతో అందరినీ మాయ చేస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో శారీలో ఉన్న ఫొటోలను షేర్ చేసింది. హైదరాబాద్ చార్మినార్‌లో చీరలో తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది రుహాని శర్మ.

చార్మినార్ రోడ్లపై తన సొగసులతో మాయ చేస్తుంది. అంతేకాకుండా చార్మినార్ వద్ద టీ టేస్ట్ చేస్తూ , అలాగే ఫ్రూట్స్ కొనుగోలు చేస్తూ పలు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇవి నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి. దీంతో ప్రస్తుతం రుహాని లేటెస్ట్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఓ లుక్ వేయండి.





























