AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

F3 movie : త్రిబుల్ ఫన్ తో రానున్న అనిల్ రావిపూడి.. ఈసారి సందడంతా ఆ హీరోదేనంట..

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరు అనిల్ రావిపూడి. కామెడీని బేస్ చేసుకొని అనిల్ తెరకెక్కించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

F3 movie : త్రిబుల్ ఫన్ తో రానున్న అనిల్ రావిపూడి.. ఈసారి సందడంతా ఆ హీరోదేనంట..
Rajeev Rayala
|

Updated on: May 16, 2021 | 3:08 PM

Share

F3 movie : టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరు అనిల్ రావిపూడి. కామెడీని బేస్ చేసుకొని అనిల్ తెరకెక్కించిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మొన్నటివరకు మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ కొట్టిన  అనిల్.. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. ఇప్పడు ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ ‘ఎఫ్ 3’ని తెరకెక్కించేపనిలో ఉన్నాడు. 2019 సంక్రాంతి బరిలో నిలిచి గెలిచిన మూవీ.. ‘ఎఫ్ 2’. కామెడీ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. పూర్తిస్థాయి నవ్వుల విందును పంచుతూ.. భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. అయితే ఇదే కాంబినేషన్ లోఅనిల్ ‘ఎఫ్ 3’ మూవీ చేస్తున్నాడు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకున్న ‘ఎఫ్ 3’ సినిమా.. ఈ ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. ప్రస్తుతం ఈ సినిమా పనులు ఆగిపోయాయి.

ఎఫ్3లో సినిమా కథ డబ్బు సంపాదన చుట్టూ తిరుగుతుందట. ఆ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తాయని అంటున్నారు. ఇందులో సునీల్ పాత్ర ప్రత్యేక ఆకర్షణ అవుతుందట. అంతే కాదు ఈ సినిమాలో వరుణ్ తేజ్ కామెడీ ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. నిజానికి ఈ సినిమాను ఈ ఆగస్టులో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. దాంతో సంక్రాంతికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్  సన్నాహాలు చేస్తున్నారు. మరి  ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకోసం బాలీవుడ్ అందాలభామ.. ‘హరిహర వీరమల్లు’లో రాణిగా…

Dhanya Balakrishna: ప‌వ‌న్ నా క్ర‌ష్‌.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుంది.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ధ‌న్య‌..

ఇండ్రస్టీలో ఇంట్రస్టింగ్ న్యూస్ : మహేష్ బాబు సినిమా కోసం పనిచేయున్న దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్..(వీడియో)

Follow Us
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
డేట్, టైమ్, లొకేషన్ ఫిక్స్.. పొలిటికల్ వార్‌కు వచ్చేదెవరు?
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఏడుస్తున్న పిల్లలను వాషింగ్ మెషీన్‌లో పెట్టి లాక్.. జెట్ స్ప్రేతో
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
ఇంగ్లాండ్ సిరీస్‌లో ఈ ముగ్గురికి అగ్నిపరీక్ష..
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
వాట్సాప్ యూజర్‌నేమ్ ఫీచర్‌కు ప్రభుత్వం తెలిపిన 8 అభ్యంతరాలు ఇవే
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
కోట్లాది డాలర్లు, వందల కేజీల బంగారం.. జనం సొమ్ము దోచేశారు!
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
నోట్లో కరిగిపోయే కమ్మనైన పేదోళ్ల పచ్చి కొబ్బరి పాయసం..
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
క్రికెట్ వేలంలో కోహ్లీ మేనల్లుడి జోరు
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
నా సినిమా చూసి మహేష్ అన్న అర్ధరాత్రి కాల్ చేశారు..
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా..? కానీ, ఈ ఒక్క పనిచేస్తే బిందాస్
రోజుకు 2 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడి బ్రష్ చేయండి..! లాభాలు ఇవే
రోజుకు 2 నిమిషాలు ఒంటి కాలిపై నిలబడి బ్రష్ చేయండి..! లాభాలు ఇవే