Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gopichand : సంపత్ నంది సినిమా పైనే ఆశలు పెట్టుకున్న మ్యాచో హీరో.. సీటీమార్ తో రానున్న గోపీచంద్..

కండలు తిరిగిన దేహంతో టాలీవుడ్‌ హంక్‌లా ఉంటారు గోపీచంద్. హీరోగా తెలుగు తెరకు పరిచయమై.. విలన్ వేశాలతో అందర్నీ ఆకట్టుకున్నారు.

Gopichand : సంపత్ నంది సినిమా పైనే ఆశలు పెట్టుకున్న మ్యాచో హీరో.. సీటీమార్ తో రానున్న గోపీచంద్..
Follow us
Rajeev Rayala

|

Updated on: May 16, 2021 | 6:41 PM

Gopichand : కండలు తిరిగిన దేహంతో టాలీవుడ్‌ హంక్‌లా ఉంటారు గోపీచంద్. హీరోగా తెలుగు తెరకు పరిచయమై.. విలన్ వేశాలతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఇక ఈ తరువాత హై ఎనర్జటిక్‌ యాక్షన్ సినిమాలతో వరుస విజయాలను సాధిస్తూ.. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా ఎదిగారు. ఇక ఆరేళ్ళ కిందటి ‘జిల్’ తర్వాత గోపీచంద్ కెరీర్ లో సరైన బొమ్మే పడలేదు. ఆక్సిజన్ లాంటి ఎక్స్ పరిమెంట్లు, పంతం లాంటి కమర్షియల్స్ కూడా నడిచిన దాఖలా లేదు. అందుకే.. ఈసారి గౌతమ్ నందా ఫేమ్ సంపత్ నందితో సీటిమార్ మూవీకి సాలిడ్ ఎఫర్ట్ పెట్టారు. కబడ్డీ నేర్చుకునిమరీ పక్కా ప్రొఫెషనల్ గా సెట్స్ లోకెళ్ళేవారు. బట్.. సీటిమార్ కి రిలీజ్ యోగం ఎప్పుడన్నది సస్పెన్సే.

ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇక మణిశర్మ సంగీత సారథ్యంలో రూపుదిద్దుకుని ఇప్పటికే రిలీజైన “జ్వాలా రెడ్డి”, “పెప్సీ ఆంటీ” సాంగులు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించి.. సినిమాపై అంచనాలు పెంచేశాయి. అంతే కాదు.. లాంగ్‌ బ్యాక్‌ రిలీజైన టీజర్‌ కూడా మరో సారి గోపీచంద్‌ బాక్సీఫీస్ దుమ్ము దులపడం ఖాయం అంటూ.. అభిమానుల చేత అరిపించింది. కాని ఇప్పటికి వరకు రిలీజ్‌ అన్న ఊసు మాత్రం మరిచింది. దీంతో గోపీచంద్‌ అభిమానులు సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

Allu Arjun Pushpa: సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న పుష్పరాజ్.. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న వీడియో…

Mahesh Babu-Trivikram: సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున మహేష్ – త్రివిక్రమ్ సినిమా మోషన్ పోస్టర్ రానుందా.?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమాకోసం బాలీవుడ్ అందాలభామ.. ‘హరిహర వీరమల్లు’లో రాణిగా…

Dhanya Balakrishna: ప‌వ‌న్ నా క్ర‌ష్‌.. ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుంది.. మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టిన ధ‌న్య‌..