AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళికి కొత్త చీపురు కొనుగోలు చేయడం వెనకున్న రహస్యం తెలుసా?

దీపావళి పండుగ రానుంది. 2026 సంవత్సరంలో నవంబర్ 8న దీపావళి పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ పండుగకు ఒక రోజు ముందు వచ్చేదానిని నరక చతుర్దశి అని అంటారు. జ్యోతిష్య శాస్త్రంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు కొన్ని పనులు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. దాని గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 30, 2026 | 3:31 PM

Share
దీపావళికి ఒక రోజు ముందు వచ్చే దానిని నరక చతుర్దశి, రూప చతుర్దశి అని కూడా అంటారు. అయితే ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఒంటికి  నువ్వుల నూనె, పసుపు రాసుకొని స్నానం చేయడం వలన ఏడాది పొడవునా ఉన్న దారిద్ర్యం, నరక బాధ తొలిగిపోతుందంట. అంతే కాకుండా ఈరోజు యమ దీపం వెలిగిస్తారు. అలాగే ఈ రోజు చీపురు కొనుగోలు చేయడం కూడా చాలా శుభ ప్రదంగా భావిస్తారు.

1 / 5
హిందూ మతంలో చీపురును లక్ష్మీదేవికి ప్రతీకగా భావిస్తారు. అందువలన నరక చతుర్దశి, చోటి దీపావళి పండుగ రోజున చీపురు కొనుగోలు చేయడం వలన ఇంటిలో సంపద, ఐశ్వర్యం పెరుగుతాయి. లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని భావిస్తారు. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, వారు కూడా దాని నుంచి త్వరగా బయటపడతారంట. అందువలన నరక చతుర్దశి రోజు చీపురు కొనుగోలు చేయడం చాలా మంచిదంట.

2 / 5
 అంతే కాకుండా, ఈ రోజు చీపురు కొనుగోలు చేయడం వలన సానుకూలత కూడా పెరుగుతుందంట. ఇది ఇంటిలో ఉన్నవారికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా మేలు చేస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారో, వారు వాటి నుంచి బయటపడతారు. సంవత్సరం మొత్తం ఆనందంగా గడుపుతారు.

3 / 5
 అలాగే,  ఈరోజు చీపురు కొనుగోలు చేయడం వలన పేదరికం కూడా తొలిగిపోతుంది. మత విశ్వాసం ప్రకారం,  నరక చతుర్దశి రోజున   కొత్త చీపురును ఇంటికి తీసుకురావడం పేదరికాన్ని నిర్మూలించడంలో సహాయపడుతుందని పండితులు చెబుతుంటారు. ఈరోజు కొత్త చీపురు కొని, తమ  ఇంటిని శుభ్రపరచడం వలన ప్రతికూల శక్తి తొలిగిపోతుందంట.

4 / 5
నరక చతుర్దశి  రోజున చీపురు కొనుగోలు చేయడం వలన ఇది ఇంటిలోకి సంతోషాన్ని, ఆనందం, శ్రేయస్సును తీసుకొస్తుంది. అన్ని విధాలుగా మీకు చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుస్తుందంట. నోట్ : పై సమాచారం కేవలం నిపుణుల సమాచారం, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us