Vastala Rajagopal: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. అదుర్స్ బామ్మ కన్నుమూత..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నాటకాల ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటి వత్సల రాజగోపాల్ కన్నుమాశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంపై ఇండస్ట్రీలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

సీనియర్ నటి వత్సల రాజగోపాల్ చెన్నైలో కన్నుమూశారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. సినిమాల్లోకి రాకముందు, ఆమె 450కి పైగా రంగస్థల నాటకాలలో నటించారు. 1992లో విడుదలైన ‘రోజా’ చిత్రంతో నటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఆమె.. తెలుగుతోపాటు తమిళంలో అనేక చిత్రాల్లో నటించారు. ఇందులో ఆమె నటి మధుబాల అమ్మమ్మ పాత్రను పోషించి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆమె పెద్ద వయసులో సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ, తన అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాలో బామ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వత్సల రాజగోపాల్ వయసు 93 సంవత్సరాలు. కొన్నాళ్లుగా వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వత్సల రాజగోపాల్ ఎక్కువగా అమ్మమ్మ పాత్రలు పోషించి జనాలకు దగ్గరయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..
సతీ లీలావతి, తిరుడ తిరుడి, కాలమెల్లం కదల్ వాజ్గా, ఎన్యాన్, రిథమ్, మోళి, విన్నర్ వంటి 400కి పైగా చిత్రాలలో నటించి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. సినిమాలతో పాటు, సిద్ధి, ఆనందం, ముంతనై ముడిచు వంటి టెలివిజన్ సీరీస్‌లలో కూడా నటించింది. వివిధ పాత్రలలో తన సహజ నటనను ప్రదర్శించి అతను దృష్టిని ఆకర్షించింది. చిత్ర పరిశ్రమకు చెందిన ఎందరో ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు. నివాళులర్పించేందుకు ఆమె పార్థివ దేహాన్ని పల్లవరంలోని ఆమె నివాసంలో ఉంచారు.
ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..
తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాతో పాపులర్ అయ్యారు. ఇందులో ఆమె నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమాల్లోకి రాకముందు నాటకరంగంలో పనిచేసిన ఆమె.. వివాహం తర్వాత 1953లో చెన్నైకి వచ్చి క్లర్క్ గా పనిచేశారు.
ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
