AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇజ్రాయెల్ లో నిర్మాణంలో ఉన్న ప్రార్థనా మందిరం కూలి ఇద్దరి మృతి, 160 మందికి పైగా గాయాలు, ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం

ఇజ్రాయెల్ లోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో నిర్మాణంలో ఉన్న ప్రార్థనా మందిరం కూలిపోగా ఇద్దరు మరణించారు. 160 మందికి పైగా గాయపడ్డారు.

ఇజ్రాయెల్ లో నిర్మాణంలో ఉన్న ప్రార్థనా మందిరం కూలి ఇద్దరి మృతి, 160 మందికి పైగా గాయాలు, ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం
Two Dead Over 160 Injured I
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 17, 2021 | 11:09 AM

Share

ఇజ్రాయెల్ లోని ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ లో నిర్మాణంలో ఉన్న ప్రార్థనా మందిరం కూలిపోగా ఇద్దరు మరణించారు. 160 మందికి పైగా గాయపడ్డారు. వేలాది యూదులు ‘షావూత్ ఫీస్ట్’ (మతపరమైన కార్యక్రమం) ని పురస్కరించుకుని నిన్న ఈ భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంలో ఈ భవనానికి నిర్మించిన పెద్ద స్టాండ్లు ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడి నుంచి బయటపడేందుకు ఒకరికొకరు తోసుకున్నారు. తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు పడిపోయారు. పన్నెండేళ్ల బాలుడితో బాటు 40 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. గాయపడినవారిని ఇజ్రాయెలీ సెక్యూరిటీ దళాలు ఆసుపత్రులకు తరలించాయి. ప్రార్థనలు చేస్తున్నవారిపై ఇవి కూలిపోవడం అత్యంత దురదృష్టకరమని జెరూసలేం కమాండర్ ఒకరు వ్యాఖ్యానించారు. ఈ దారుణ ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఇటీవలే యూదుల యాత్రా స్థలం వద్ద జరిగిన తొక్కిసలాటలో 45 మంది మరణించగా… మరికొందరు గాయపడ్డారు.. వెస్ట్ బ్యాంక్ వద్ద కనవడిన శిథిలాలు జరిగిన దారుణానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

కాగా ఇక్కడ ప్రార్ధనా మందిరం ఇంకా నిర్మాణ దశలో ఉందని, ఈ స్థలం వద్ద ప్రార్థనలు జరపడానికి అనుమతి లేదని, ఈ భవనం సురక్షితమైనది కాదని ఇదివరకే తాము హెచ్చరించామని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. జెరూసలేం లో ప్రతి ఏటా ఈ విధమైన ప్రార్ధనా సమావేశాలు జరుగుతుంటాయి. వేలమంది వీటికి హాజరవుతుంటారు. ముఖ్యంగా యూదులు వీటిలో అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

హైదరాబాద్‌ చెరువుల్లో కరోనా ఆనవాళ్లు… నీటిని తాకారో కరోనా గ్యారంటీ…( వీడియో )

Shekar Master: డ్యాన్సర్‌లందరికీ నేనున్నా… ఉపాధి కోల్పోయిన వారికి ఉచితంగా… ( వీడియో )

Nagarjuna: జూన్ నుంచి జోరు పెంచనున్న నాగార్జున.. శరవేగంగా కొత్త సినిమా షూటింగ్