రాజకోటల్లాంటి ఇళ్లున్న గ్రామం, ఇప్పడది పర్యాటక కేంద్రం

కొన్ని ప్లేసులు అక్కడున్న ఇళ్లతో ఫేమస్సవుతాయి..! ప్రత్యేకంగా కనిపించే ఇళ్లే టూరిస్టులను ఆకట్టుకునే ఆకర్షణాయంత్రాలవుతాయి.. అలాంటివే ఖెవ్‌సురైటీలో ఉన్న గ్రామాల్లోని నివాసాలు!

రాజకోటల్లాంటి ఇళ్లున్న గ్రామం,  ఇప్పడది పర్యాటక కేంద్రం
Khevsureti
Follow us
Balu

| Edited By: Phani CH

Updated on: May 17, 2021 | 11:00 AM

కొన్ని ప్లేసులు అక్కడున్న ఇళ్లతో ఫేమస్సవుతాయి..! ప్రత్యేకంగా కనిపించే ఇళ్లే టూరిస్టులను ఆకట్టుకునే ఆకర్షణాయంత్రాలవుతాయి.. అలాంటివే ఖెవ్‌సురైటీలో ఉన్న గ్రామాల్లోని నివాసాలు! అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఖెవ్‌సురైటీ అనేది ఓ ప్రాంతం. అక్కడ కకాసస్‌ అనే పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఎత్తైన పర్వతాలున్నప్పుడు వాటి పక్కన లోయలు కూడా ఉంటాయిగా! ఆ లోయల్లోనే చిన్న చిన్న గ్రామాలున్నాయి. ఇప్పుడా గ్రామాలే పర్యాటకులకు విడిదిలవుతున్నాయి.కారణం అక్కడున్న కోటల్లాంటి ఇళ్లు! దూరం నుంచి చూస్తే రాతితో నిర్మించిన దుర్గంలా కనిపిస్తాయి గ్రామాలు! పెద్దపెద్ద రాతి బురుజులతో రాజసౌధన్ని తలపిస్తాయి. ఎందుకంటే అంతెత్తు రాతిగోడలు కోటలకే ఉంటాయిగా! పైగా పెద్ద పెద్ద కిటికీలు, బాల్కనీలతో బహు విచిత్రంగా ఉంటాయి ఆ ఇళ్లు! ఇలా వింతగా విభిన్నంగా ఇళ్లను కట్టుకోవడానికి ప్రత్యేకమైన రీజనంటూ ఒకటి ఉండాలిగా! అదేమిటంటే దొంగలభయం! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం! అప్పట్లో ఇక్కడ ఉన్నవారు కొండలను తొలచుకుని చిన్న చిన్న నివాసయోగ్యాలుగా చేసుకుని వాటిల్లో ఉండేవారు. చుట్టుపక్కల పరిశ్రమలు గట్రాలు లేవు కాబట్టి సహజంగానే ఎవరికీ ఉద్యోగాలు సద్యోగాలు లేవు.. పొట్టనింపుకోవడానికి ఏదైనా పనిచేద్దామంటే అదీ దొరికేది కాదు! అందుకే వారంతా దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఊళ్లకు ఊళ్లూ దోచుకుకునేవారు!

కొంతకాలం భరించారు గ్రామస్తులు. దొంగల తాకిడి ఎక్కువయ్యేసరికి ఊళ్లన్ని ఒక్కటయ్యాయి. దొంగల బారి నుంచి తప్పించుకోవడమెలా? అని ఆలోచిస్తే ఇలా ఎత్తయిన గోడలతో ఇల్లు కట్టుకోవడమేనన్న అవుడియా వచ్చింది.. అంతే, అందరూ తలో చేయి వేసి ఎత్తయిన కోట గోడలతో ఇళ్లను కట్టుకున్నారు. అందరూ ఒక్కచోటనే ఉండేసరికి దొంగలకు కూడా భయమేసి రావడం మానేశారు. ఎవరి ఇళ్లలో వారు హాయిగా, ధైర్యంగా నివసించసాగారు. అలా ఈ ప్రాంతంలో ఉన్న చాలా గ్రామాలు కోట ఇళ్లుగా మారిపోయాయి. అందుకే ఈ గ్రామాలను ఫోర్ట్‌ విలేజస్‌ అని పిలుచుకుంటారు. అన్నట్లు దొంగల నుంచి కాపాడుకోవడానికి మగవాళ్లంతా యుద్ధ కళలను నేర్చుకున్నారు.. ఆ విద్యల్లో ఆరితేరారు. తరాలు మారినా అది మాత్రం కొనసాగుతూనే వస్తోంది. ఇప్పటికీ అక్కడి యువకులు యుద్ధకళల్లో తిరుగులేని ప్రావీణ్యం సంపాదిస్తున్నారు.. ఇప్పుడు అక్కడి గ్రామాలలో ప్రజలు పెద్దగా నివసించడం లేదు. కాకపోతే షతిలి అనే గ్రామంలో మాత్రం పది పదిహేను కుటుంబాలు నివసిస్తున్నాయి. ముందే చెప్పినట్టు ఇదో పర్యాటక ప్రాంతంగా మారిందిప్పుడు!

మరిన్ని ఇక్కడ చూడండి:Surekha Vani: పవన్ కళ్యాణ్‌కి 100 ముద్దులు… సీక్రెట్స్ బయటపెట్టిన సురేఖా వాణి.. ( వీడియో )

Miss Universe2021: మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న మెక్సికన్ భామ.. ఆండ్రియా మెజా

Pizza on Volcano: అగ్నిపర్వతం లావాపై పిజ్జా తయారు చేసిన వ్యక్తి… ( వీడియో )