Vaccine: ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తుల వ్యవస్థలో టాప్ ప్లేస్ లో ఇండియా.. మరి కరోనా టీకాకు ఏమైంది?.. నిపుణులు ఏమంటున్నారు?

Vaccine: కరోనా మహమ్మారి అలల మాదిరిగా విరుచుకుపడుతోంది. మొదటి వేవ్ లో ఒకరకంగా ఉన్న వైరస్.. ఇప్పుడున్న రెండో వేవ్ లో మరోరకంగా మారిపోయింది. అయితే, కరోనాను అడ్డుకునే బ్రహ్మాస్త్రం వ్యాక్సిన్.

Vaccine: ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తుల వ్యవస్థలో టాప్ ప్లేస్ లో ఇండియా.. మరి కరోనా టీకాకు ఏమైంది?.. నిపుణులు ఏమంటున్నారు?
Covid Vaccine
Follow us
KVD Varma

|

Updated on: May 17, 2021 | 11:36 AM

Vaccine: కరోనా మహమ్మారి అలల మాదిరిగా విరుచుకుపడుతోంది. మొదటి వేవ్ లో ఒకరకంగా ఉన్న వైరస్.. ఇప్పుడున్న రెండో వేవ్ లో మరోరకంగా మారిపోయింది. అయితే, కరోనాను అడ్డుకునే బ్రహ్మాస్త్రం వ్యాక్సిన్. భారతదేశం వ్యాక్సిన్ తయారీలో.. ముందు వరుసలో నిలిచింది. కరోనాకు టీకాను ప్రపంచానికి అందించడంలో మొట్టమొదటి అడుగు ఒకరకంగా భారత్ నుంచే పడిందని చెప్పొచ్చు. ఇది ఒక్క కరోనా అనే కాదు వివిధ రకాల వ్యాధులలో టీకాలను ప్రపంచానికి అందివ్వడంలో మన దేశం ప్రధాన భూమిక పోషిస్తోంది. అన్ని రకాల వ్యాధులకు కలిపి ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలో 70 శాతం వ్యాక్సిన్లు సరఫరా చేస్తోంది. మరి ఇంత చరిత్ర ఉన్న మనదేశంలో కరోనా వ్యాక్సిన్ కొరత రావడానికి కారణం ఏమిటి? ఎందుకు వ్యాక్సిన్ ఎక్కువ ఉత్పత్తి కావడం లేదు?

ఈ ప్రశ్నలకు నిపుణులు చెబుతున్న సమాధానం ఒక్కటే. దాదాపు 16 కంపెనీలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సామర్ధ్యం కలిగి ఉండగా.. కేవలం రెండు కంపెనీలు మాత్రమే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. అందుకే.. కరోనా టీకాకు సంబంధించిన బయోటెక్ కోవేరియేట్ ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకోవాలని చాలా మంది కోరారు. ఈ నేపధ్యంలో ఆ ఫార్ములాను ఇతర కంపెనీలతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని నేషనల్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ డాక్టర్ వి.కె పాల్ ఇటీవల చెప్పారు. ఇప్పుడు ఈ ఫార్ములా కనుక ఇతర కంపెనీలు తీసుకుని టీకా ఉత్పత్తి ప్రారంభిస్తే.. మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుందని చెప్పడంలో సందేహం లేదు.

ఎందుకంటే.. మన దేశంలో టీకాలు ఉత్పత్తి చేసే సత్తా ఉన్న కంపెనీలు 16 ఉన్నాయి. వీటికీ కేంద్రం అనుమతి ఇస్తేకనుక ఇవి ప్రతినెలా 25 కోట్ల మోతాదుల వ్యాక్సిన్ అందించగలవు. అంటే, సంవత్సరానికి 300 కోట్ల మోతాదులు. ప్రస్తుతం వ్యాక్సిన్ ఉత్పత్తికి అనుమతి ఉన్న భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్ లు రెండూ కలిపి ప్రతి నేలా 7.5 కోట్ల టీకాలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఆలస్యం చేసిందని కేంద్రంలో సాధికారిక బృందానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరు చెప్పారు. వ్యాక్సిన్ తయారుచేసే సంస్థలతో నిరంతరం మాట్లాడటం, ప్రారంభంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. అదే విధంగా.. వ్యాక్సిన్ తయారీ సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటే ఒక రోజులో ఆమోదించవచ్చని చెబుతున్నారు. ఇది జరిగితే, కంపెనీలు తమ ప్రస్తుత మౌలిక సదుపాయాలతోనే ఉత్పత్తిని కూడా ప్రారంభించవచ్చు. హైదరాబాద్ గ్నోమ్ వ్యాలీలో అనేక ప్లాంట్లు ఉన్నాయని, దీనిలో వ్యాక్సిన్ తయారు చేయవచ్చని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పరిశ్రమ మరియు వాణిజ్య) జయేష్ రంజన్ అన్నారు. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కసౌలీకి చెందిన డాక్టర్ సంతోష్ కుట్టి మాట్లాడుతూ, “మేము అనుమతులు వస్తే కరోనా వ్యాక్సిన్ కూడా తయారు చేయడం ప్రారంభించవచ్చు. ఇది చాలా అనుమతులతో కూడుకుని ఉంది. కేంద్రం మాత్రమే వీటికి అనుమతులు ఇవ్వగలదు.” అన్నారు.

వ్యాక్సిన్ బాట్లింగ్, ప్యాకేజింగ్ పనిని దేశంలోని సంస్థలకు ఇస్తే 90% సమయం ఆదా అవుతుందని శాస్త్రవేత్త వీరభద్రరావు చెప్పారు. దాని ప్రమాణాలకు అనుగుణంగా 1100 కంపెనీలు మన దేశంలో ఉన్నాయని ఆయన అంటున్నారు. టెక్నాలజీ బదిలీ ఒప్పందం వ్యాక్సిన్ వే అనీ, టీకా సూత్రీకరణ పేటెంట్ ఉన్న సంస్థ ఫార్ములా ఇవ్వగలదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) మాజీ డైరెక్టర్ డాక్టర్ సిహెచ్ మోహన్రావ్ చెప్పారు. ఇందుకోసం బీఎస్‌ఎల్‌-3 ల్యాబ్‌ ఉండాలి. హైదరాబాద్‌లో ఇలాంటి 15 ల్యాబ్‌లు, పూణేలో 5 ఉన్నాయి. ఈ టీకాను మాతృ సంస్థ విక్రయిస్తుంది. టీకా తయారీదారు ఒప్పందం ప్రకారం వాటా పొందుతాడు. టెక్నాలజీ బదిలీ ఒప్పందం ప్రకారం ఇది జరుగుతుంది. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సమయం వృధా చేసింది. ఇప్పటికైనా ఇతర సంస్థలకు అనుమతులు ఇవ్వడం వేగవంతంగా చేయాలి.

Also Read: COVID Vaccine: హర్యానాలోని గురుగ్రామ్ జిల్లాలో వృధాగా పోయిన 60 వేల కరోనా వ్యాక్సిన్లు.. ఎందుకంటే..

Vaccination: ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిన నగరాల్లో అదుపులో కరోనా వైరస్..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు