Sleepless Problem: ఎక్కువకాలంగా నిద్రమాత్రలు ఉపయోగిస్తున్నారా? దానివలన ఉపయోగం లేదట.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

Sleepless Problem: చాలా మంది నిద్ర పట్టడం లేదని నిద్రమాత్రలు వేసుకుంటారు. నిద్రలేమి, నిద్రలేమితో పోరాడుతుంటే, ఎక్కువగా నిద్రమాత్రలు తీసుకోవడం అలవాటు ఉన్నవారు చాలా మంది ఉన్నారు.

Sleepless Problem: ఎక్కువకాలంగా నిద్రమాత్రలు ఉపయోగిస్తున్నారా? దానివలన ఉపయోగం లేదట.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
Sleepless Problem
Follow us

|

Updated on: May 17, 2021 | 11:25 AM

Sleepless Problem: చాలా మంది నిద్ర పట్టడం లేదని నిద్రమాత్రలు వేసుకుంటారు. నిద్రలేమి, నిద్రలేమితో పోరాడుతుంటే, ఎక్కువగా నిద్రమాత్రలు తీసుకోవడం అలవాటు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కానీ, అలా నిద్రమాత్రలు తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి నుండి ఉపశమనం పొందడంలో ఇవి సహాయపడతాయని అందరూ భావిస్తారు. ఇది సరైనదా కాదా అనే విషయంపై అమెరికన్ శాస్త్రవేత్తలు కొందరు పరిశోధనలు చేశారు. వీరి పరిశోధన ప్రకారం, గరిష్టంగా 6 నెలల వరకు మాత్రమే నిద్రలేమిని నయం చేయడానికి నిద్ర మందులు పనిచేస్తాయని క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితం అయింది. పరిశోధనలు చేస్తున్న యునైటెడ్ స్టేట్స్ లోని బ్రిఘం, ఉమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు, వైద్యులు రోగులకు ఎక్కువ కాలం మందులు సూచించడం మంచిది కాదని, దానిని నివారించడం అవసరం అనీ చెబుతున్నారు. .

నిద్రలేమితో బాధపడుతున్న 685 మంది మహిళలపై వీరు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధన నిద్రలేమి రోగులకు నిద్రకు సంబంధించిన ఔషధం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి జరిపారు.ఈ పరిశోధనకు తీసుకున్న సగటు వయస్సు 50 సంవత్సరాలు. ఈ మహిళలందరికీ నిద్రపోయే సమస్యలు ఉన్నాయి. నిద్ర భంగం అదేవిధంగా నిద్రలేమి కారణంగా వారు బాధపడ్డారు. వీరిలో 238 మంది మహిళలకు నిద్ర మందులు ఇచ్చారు. 447 మందికి మందులు ఇవ్వలేదు. ఒకటి, రెండు సంవత్సరాల తరువాత, ఆ మహిళలను ప్రశ్నించారు. నిద్ర మందులు మహిళల నిద్రలేమి సమస్యపై పెద్ద ప్రభావాన్ని చూపించలేదని ఫలితంలో వెల్లడైంది.

పరిశోధన ప్రారంభంలో, ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు రాత్రి నిద్రలేమి గురించి ఫిర్యాదు చేశారు. ఎక్కువ మంది మహిళలు ప్రతి 3 రాత్రులలో ఒకరోజున నిద్రలేమి సమస్య వేధిస్తుందని చెప్పారు. పరిశోధకుడు డాక్టర్ డేనియల్ సోలమన్ ప్రకారం, నిద్రలేమి సమస్య సాధారణం అవుతోంది. గత 2 దశాబ్దాలలో స్లీపింగ్ మందులు తీసుకునే వారిలో పెరుగుదల ఉంది. అయితే, నిద్ర కోసం తీసుకునే మందుల ప్రభావం 2 నుండి 12 వారాల వరకు ఉంటుంది. ఆ తరువాత ఆ మందులు పనిచేయవు. అయినప్పటికీ, రోగులు దీనిని ఎక్కువ కాలం వాడుతూనే ఉంటారు. వైద్యులు కూడా ఈ మందులు కొంత కాలం మాత్రమే తీసుకోవాలని సిఫారసు చేస్తారు, కాని రోగులు నిపుణుల సలహా వదిలిపెట్టి చాలా కాలం ఈ మందులను వాడుతూ ఉంటారు. అది మంచింది కాదు అంటున్నారు నిపుణులు.

నిద్రలేమితో బాధపడేవారు.. ముందు నిద్రపోకపోవడానికి గల కారణాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని పరిశోధకులు కూడా చెబుతున్నారు. చాలా సందర్భాలలో, ఇది అనారోగ్యాల వల్ల కావచ్చు. డయాబెటిస్, అధిక రక్తపోటు, నొప్పి అలాగే నిరాశ వంటి వ్యాధులు వీటిలో ఉన్నాయి. వారికి ఉన్న ఆ ఇబ్బందులు తెలుసుకుని దానికి మందులు ఇవ్వడం.. ఆ సమస్యల తీవ్రతను తగ్గించడం ద్వారా నిద్రలేమి సమస్యను దూరం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

Also Read: Balck Fungus: వాతార‌ణం ద్వారా బ్లాక్ ఫంగ‌స్ ఎలా సోకుతుంది.? షుగ‌ర్ ఉన్న వారికి బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తుందా.?

మహిళలతో పోలిస్తే పురుషుల చర్మం చాలా కఠినం..! అందమైన ముఖ తేజస్సు కోసం వీటిని ఫాలోకండి..