Black Fungus: వాతావరణం ద్వారా బ్లాక్ ఫంగ‌స్ ఎలా సోకుతుంది.? షుగ‌ర్ ఉన్న వారికి బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తుందా.?

Black Fungus: క‌రోనా వ్యాధి త‌గ్గింద‌ని సంతోషించే వారికి ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. వ్యాధి త‌గ్గిన వారిలో బ్లాక్ ఫంగ‌స్ అనే కొత్త వ్యాధి క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా...

Black Fungus: వాతావరణం ద్వారా బ్లాక్ ఫంగ‌స్ ఎలా సోకుతుంది.? షుగ‌ర్ ఉన్న వారికి బ్లాక్ ఫంగ‌స్ వ‌స్తుందా.?
Blackfungus
Follow us
Narender Vaitla

| Edited By: Rajitha Chanti

Updated on: May 17, 2021 | 4:12 PM

Black Fungus Infection: క‌రోనా వ్యాధి త‌గ్గింద‌ని సంతోషించే వారికి ఇప్పుడు బ్లాక్ ఫంగ‌స్ వ్యాధి తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. వ్యాధి త‌గ్గిన వారిలో బ్లాక్ ఫంగ‌స్ అనే కొత్త వ్యాధి క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా షుగ‌ర్ పేషెంట్స్‌లో బ్లాక్ ఫంగ‌స్ సోకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని వ‌స్తోన్న వార్త‌లు అందరినీ ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. అయితే బ్లాక్ ఫంగ‌స్ ఆక్సిజ‌న్ తీసుకునే స‌మ‌యంలో ఉప‌యోగించే నీటి ద్వారా ఫంగ‌స్ వ‌స్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వాతావ‌ర‌ణం ద్వారా కూడా ఫంగ‌స్ సోకే అవ‌కాశాలున్నాయ‌ని చెబుతున్నారు. ఇక షుగ‌ర్ వ్యాధికి ఫంగ‌స్‌కు సంబంధ‌మేంట‌న్న వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం..

షుగ‌ర్ నియంత్ర‌ణ‌లో ఉంటే..

షుగర్ వ్యాధి నియంత్ర‌ణంలో ఉంటే బ్లాక్ ఫంగ‌స్ సోకే అవ‌కాశం లేద‌ని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఉద‌యం ప‌ర‌గ‌డుపున షుగ‌ర్ లెవ‌ల్స్ 125 కంటే త‌క్కువ‌గా.. టిఫిన్ చేసిన త‌ర్వాత 250 కంటే త‌క్కువ‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు. క‌రోనా నుంచి క్ర‌మం త‌ప్ప‌కుండా షుగ‌ర్ ప‌రీక్ష చేయించుకుంటూ.. షుగ‌ర్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని చెబుతున్నారు.

వాతావ‌ర‌ణం నుంచి ఎలా సోకుతుంది..

బ్లాక్ ఫంగ‌స్‌కు మ‌రో పేరు మ్యుకోర్ ఫంగ‌స్‌. స‌హ‌జంగానే వాతావ‌ర‌ణంలో మ్యుకోర్ అనే ఫంగ‌స్ ఉంటుంది. ఇది మ‌నుషుల‌కు గాలి ద్వారా సోకుతుంది. శ‌రీరంలోకి వెళ్లిన ఫంగ‌స్ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరుతుంది. కోవిడ్ సోకిన వారిలో ఈ వ్యాధి ఎక్కువ‌గా సోకే అవ‌కాశం ఉంది. వీరితో పాటు.. స్టెరాయిడ్స్ ఉప‌యోగించిన వారిలో.. ఐసీయూలో చికిత్స పొందిన వారికి ఈ ముప్పు ఎక్కువ‌గా ఉంటుంది. ఇక బ్లాక్ ఫంగ‌స్ సోకిన వారిలో కంటిగుడ్డు కింద ఎర్రబడి దురదగా ఉండటం, ముక్కులో దురదగా ఉండటం, పదేపదే ముక్కును నలిపేయాలనిపించడం, దంతాల్లో నొప్పి, తిమ్మిరి, వాపు, ముఖంలో వాపు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయి. పై ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని నిపుణులు సూచించారు.

Also Read: Black magic: క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆదివారం వ‌చ్చిందంటే అక్క‌డ వ‌ణుకు

Vaccination: ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఎక్కువగా జరిగిన నగరాల్లో అదుపులో కరోనా వైరస్..

Interesting: ఇది ప్రపంచంలోని విచిత్రమైన సరస్సు, దీని లోప‌ల అడ‌వి ఉంది.. వివ‌రాలు