Interesting: ఇది ప్రపంచంలోని విచిత్రమైన సరస్సు, దీని లోప‌ల అడ‌వి ఉంది.. వివ‌రాలు

ఈ ప్రపంచంలో చాలా సరస్సులు ఉన్నాయి. అవి ప్రపంచ సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి. అయితే ఇప్పుడు మీకు విచిత్ర‌మైన స‌రస్సు గురించి చెప్పబోతున్నాం.

Interesting:    ఇది ప్రపంచంలోని విచిత్రమైన సరస్సు, దీని లోప‌ల అడ‌వి ఉంది.. వివ‌రాలు
Kaindy Lake
Follow us
Ram Naramaneni

|

Updated on: May 17, 2021 | 8:35 AM

ఈ ప్రపంచంలో చాలా సరస్సులు ఉన్నాయి. అవి ప్రపంచ సౌందర్యానికి ప్రసిద్ధి చెందాయి. అయితే ఇప్పుడు మీకు విచిత్ర‌మైన స‌రస్సు గురించి చెప్పబోతున్నాం. ఈ స‌ర‌స్సు లోప‌ల ఏకంగా ఓ అడ‌వి ఉంది. ఈ విష‌యం వినడానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా పూర్తి వాస్త‌వం. మేము మాట్లాడుతున్న సరస్సు కజకిస్తాన్‌లో ఉంది. దీనిని ‘లేక్ కాండీ’ అంటారు. ఈ సరస్సులో వింత చెక్క స్తంభాలు ఉన్నాయి. ఈ సరస్సులో ఉన్న కొన్ని చెట్లు నీటిలో ఉండగా, మిగిలినవి నీటిలో మునిగిపోతాయి. అంటే, ఈ చెట్లు నీటి లోపల అడవి మాదిరిగా ఉంటాయి.

భూకంపం కారణంగా ఇలా జరిగింది

1911 సంవత్సరంలో, ఈ ప్రాంతంలో భయంకరమైన భూకంపం సంభవించిందని, దీనివల్ల ఈ ప్రాంతం మొత్తం తీవ్ర గందరగోళంలో పడిందని, అడవి మొత్తం నీటిలో మునిగిపోయిందని చెబుతారు. మాములుగా అయితే నీరు ఎక్కువ‌గా ఉంటే చెట్లు కుళ్లిపోతాయి. ఆశ్చర్యకరంగా, ఈ చెట్లు తమను తాము నీటిలో ఉండే.. అలవాటు చేసుకున్నాయి. ఇప్పుడు వాటి కొత్త కొమ్మలు నీటి లోప‌ల కూడా చాలా అడుగుల పొడవు పెరుగుతున్నాయి. ఈ సరస్సు సముద్ర మట్టానికి 2,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ సరస్సులోని నీరు చాలా చల్లగా ఉంటుంది. సరస్సు నీరు చెట్లకు రిఫ్రిజిరేటర్‌గా పనిచేస్తుంది. ఈ విచిత్రమైన సరస్సు కజకిస్తాన్ అతిపెద్ద నగరమైన అల్మట్టి నుండి 280 కిలోమీటర్ల దూరంలో ఉంది.

కాగా ఇది కజకిస్తాన్ ప్రధాన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఈ సరస్సు చూడటానికి ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు. శీతాకాలంలో, ఈ సరస్సు ఐస్ డైవింగ్, ఫిషింగ్ కోసం కూడా ప్రసిద్ది చెందింది. రాత్రి వెన్నెల‌ సమయంలో, ఈ సరస్సు మ‌రింత సుంద‌రంగా ఉంటుంది.

Also Read: రఘురామకృష్ణంరాజు కాళ్లపై ఉన్న గాయాలకు ‘ఎడిమా’నే కారణం..! రిపోర్టులో..

 కరోనాపై మరో అస్త్రం.. ఈ రోజే 2-డీజీ ఫ‌స్ట్ బ్యాచ్ రిలీజ్.. ఎక్కడంటే..?