CID Case: రఘురామకృష్ణంరాజు కాళ్లపై ఉన్న గాయాలకు ‘ఎడిమా’నే కారణం..! రిపోర్టులో..
Raghu Rama Krishna Raju Case: రఘురామకృష్ణం రాజు అరెస్టు అనంతరం జరిగిన పరిణామాల గురించి అందరికి తెలిసిందే. అరెస్టు తర్వాత తనను కొంతమంది అరి కాళ్లపై
Raghu Rama Krishna Raju Case: రఘురామకృష్ణం రాజు అరెస్టు అనంతరం జరిగిన పరిణామాల గురించి అందరికి తెలిసిందే. అరెస్టు తర్వాత తనను కొంతమంది అరి కాళ్లపై కొట్టారని.. వేధింపులకు గురిచేశారని రఘురామకృష్ణంరాజు కోర్టులో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించాలని మెడికల్ బోర్టును ఏర్పాటు చేసింది. అయితే రఘురామకృష్ణంరాజు చూపించిన అరికాలు గాయాలు.. గాయాలు కావని జీజీహెచ్ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. రఘురామరాజు కాలిపై కనిపిస్తున్న మచ్చలు లేక గుర్తులకు కారణం ఎడీమా అని వారు నివేదికలో వెల్లడించినట్లు సమాచారం.
అయితే.. రఘురామకృష్ణంరాజు రెండుకాళ్లకి ఎడీమా ఉందని పేర్కొన్నారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల లేదా నిలబడ్డం వల్ల రెండు కాళ్లపాదాల రంగు మారి ఉండొచ్చని పేర్కొన్నారు. రఘురామరాజు శరీరంపైన ఎలాంటి గాయాలూ లేవని.. ఆయన పాదాల రంగు మారడానికి కారణం ఎవరో కొట్టడం వల్లకాదని స్పస్టంచేసింది. రఘురామకృష్ణంరాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారనే నెపంతో ఈ నెల 14వ తేదీ సాయంత్రం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఎడిమా అంటే..
మెడికేషన్ వల్ల లేదా గర్భందాల్చడం లేదా ఇన్‌ఫెక్షన్ల వల్ల ఎడిమా వస్తుంది. రక్తనాళాల నుంచి ద్రవాలు స్రవించి, ఈ ద్రవాలు పక్కనే ఉన్న కణజాల మీద పేరుకుంటాయి. దీనివల్ల కాళ్లు వాచినట్టుగా, ఎర్రగా కమిలినట్టుగా కనిపిస్తాయి. ఇదే అంశాన్ని జీజీహెచ్ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
Also Read: