Pvt Hospitals : ట్విట్టర్లో బాధితుడి ఫిర్యాదు, మహబూబ్ నగర్ జిల్లాలో పంచవటి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

TS Minister Srinivas goud inspection : ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనా రోగుల నుండి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు...

Pvt Hospitals : ట్విట్టర్లో బాధితుడి ఫిర్యాదు, మహబూబ్ నగర్ జిల్లాలో పంచవటి ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
Pvt Hospitals Srinivas Goud
Follow us
Venkata Narayana

|

Updated on: May 16, 2021 | 11:38 PM

TS Minister Srinivas goud inspection : ప్రైవేట్ ఆస్పత్రులలో కరోనా రోగుల నుండి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలోని పంచవటి ప్రైవేటు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వార్డు, రోగులకు అందిస్తున్న చికిత్స, పరీక్షలు, బిల్లులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోగుల సహాయకులతో మాట్లాడుతూ బిల్లులపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఏప్పుడు చేరారని? బిల్లు ఎంత చెల్లించారని? ఇప్పటివరకు ఎంత అయిందని? పలువురు రోగుల సహాయకులను అడిగి తెలుసుకున్నారు. అలాగే మహబూబ్ నగర్ పట్టణంలోని నవోదయ ఆసుపత్రి ముందు కరోన రోగుల సహాయకులతో కూడా మంత్రి మాట్లాడారు. ఇక్కడ కూడా కరోన రోగులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారని? బిల్లులు ఎంత వసూలు చేస్తున్నారని? ఆక్సిజన్, వెంటిలేటర్ సదుపాయాలు కల్పిస్తే ఎంత తీసుకుంటున్నారని.. వారం రోజులకు ఎంత చెల్లిస్తున్నారని.. ? వారికి అవసరమైన సౌకర్యాలు ప్రైవేటు ఆస్పత్రులు కలుగజేస్తున్నాయా.. లేదా ? అని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడైనా ప్రైవేట్ ఆస్పత్రిలో ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు చేపడతామని మంత్రి హెచ్చరించారు. డాక్టర్లు లేదా కింది స్థాయి వారు కానీ ఎవరైనా ఈ విషయంలో తప్పు చేస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని అన్నారు.

కరోనా విపత్తు ను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా దృక్పథంతో రోగులకు చికిత్స అందించాలని, అధిక ఫీజులు వసూలు చేయవద్దని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఆక్సిజన్, రెమిడిసివర్ ఇవ్వాలని, అవసరమైతే పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలని, ప్రభుత్వ సూచనల ప్రకారం ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో 20 శాతం పడకలు కరోన రోగుల కోసం సిద్ధంగా ఉంచాలని కోరారు. ఆసుపత్రుల్లో చేర్చుకునే ముందు ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్లు ఖాళీ లేని పక్షంలోనే ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా మంత్రి పంచవటి ఆసుపత్రి పై ట్విట్టర్ లో వచ్చిన ఫిర్యాదు కు సంబంధించిన రోగి సహాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పుడు బాగానే ఉందని వారు మంత్రికి తెలిపారు.