Different Marriage: త‌న చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టిన వ‌దువు.. సినిమాను త‌ల‌పించిన రియ‌ల్ సీన్‌..

Different Marriage: పెళ్లి పీఠ‌ల‌పై వివాహాలు ఆగిపోవ‌డం, నా చెల్లి కోసం నా ప్రేమ‌ను త్యాగం చేస్తున్నాను.. నువ్వు నా చెల్లినే పెళ్లి చేసుకోవాలి. ఇలాంటి స‌న్నివేశాలు మ‌న‌కు ఎక్కువ‌గా సినిమాల్లో కనిపిస్తుంటాయి...

Different Marriage: త‌న చెల్లిని కూడా పెళ్లి చేసుకోవాల‌ని ప‌ట్టుబ‌ట్టిన వ‌దువు.. సినిమాను త‌ల‌పించిన రియ‌ల్ సీన్‌..
Diffrent Marriage
Follow us
Narender Vaitla

|

Updated on: May 17, 2021 | 7:13 AM

Different Marriage: ‘పెళ్లి పీఠ‌ల‌పై వివాహాలు ఆగిపోవ‌డం, నా చెల్లి కోసం నా ప్రేమ‌ను త్యాగం చేస్తున్నాను.. నువ్వు నా చెల్లినే పెళ్లి చేసుకోవాలి’. ఇలాంటి స‌న్నివేశాలు మ‌న‌కు ఎక్కువ‌గా సినిమాల్లో కనిపిస్తుంటాయి. సినిమా క్లైమాక్స్‌లో వ‌చ్చే ఇలాంటి ఓ స‌న్నివేశమే నిజ జీవితంలోనూ చోటు చేసుకుంది. క‌ర్ణాటక రాష్ట్రంలో జ‌రిగిన సినిమాను త‌ల‌పించే స‌న్నివేశం స్థానికంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వివ‌రాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క‌లోని కోలారు జిల్లా ముళ‌బాగిలు తాలుకాలోని వేగ‌మ‌డుగు గ్రామానికి చెందిన రాణెమ్మ‌, నాగ‌రాజ‌ప్ప ద‌పంతుల కుమార్తె సుప్రియకు వివ‌వాహం నిశ్చ‌య‌మైంది. అయితే సుప్రియ చెల్లెలు ల‌లిత మూగ‌-బ‌ధిర‌.. దీంతో ల‌లిత‌ను ఎవ‌రు పెళ్లి చేసుకుంటారోన‌ని సుప్రియ ఎప్పుడూ ఆలోచ‌న‌తో ఉండేది. త‌న పెళ్లి అవుతుంద‌ని కానీ.. చెల్లెలు వివాహం ఎలా అని మ‌ద‌న‌ప‌డి పోయిన సుప్రియ ఓ వింత ఆలోచ‌న‌కు తెర తీసింది. ఈ త‌రుణంలో ఈనెల 7న సుప్రియ వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తీరా వివాహ పీఠ‌లు ఎక్కే స‌మ‌యానికి త‌న చెల్లి.. ల‌లిత‌ను కూడా వివాహం చేసుకోవాల‌ని కాబోయే భ‌ర్త‌కు కండిష‌న్ పెట్టింది సుప్రియ. త‌న చెల్లిని త‌న‌తోపాటు పెళ్లి చేసుకునంటేనే ఈ పెళ్లికి ఒప్పుకుంటాన‌ని తేల్చిచెప్పింది. దీంతో చేసేది ఏమి లేక పెద్ద‌ల కోరిక మేర‌కు వ‌రుడు ఇద్ద‌రి మెడ‌లో తాళి క‌ట్టాడు. ఇదిలా ఉంటే ల‌లిత‌కు ఇంకా 18 ఏళ్లు నిండ‌క‌పోయే స‌రికి అధికారులు వ‌చ్చి పెళ్లి కొడుకు స‌హా మిగ‌తా ఏడుగురిపై కేసు న‌మోదు చేశారు.

Also Read: Corona on Children: చిన్నారుల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా.. ఉత్తరాఖండ్ లో పదిరోజుల్లో వెయ్యిమంది పిల్లలకు కోవిడ్!

Kedarnath: తెరచుకుంటున్న కేదార్‌నాథ్ ఆలయం.. భక్తులకు నో ఎంట్రీ.. ఆన్‌లైన్‌ దర్శనాలు మాత్రమే!

Vijay Sethupathi : విజయ్ సేతుపతి బాలీవుడ్ సినిమాను అడ్డుకున్న కరోనా.. ఆగిపోయిన షూటింగ్ ..

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?