Corona on Children: చిన్నారుల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా.. ఉత్తరాఖండ్ లో పదిరోజుల్లో వెయ్యిమంది పిల్లలకు కోవిడ్!

Corona on Children: కరోనా రెండో వేవ్ ప్రమాదకరంగా పరిణమించింది. మొదటి వేవ్ తో పోలిస్తే మరణాల సంఖ్య ఎక్కువైంది. అలాగే..చిన్నవయసు వారికీ ఈ మహమ్మారి సోకుతోంది. చిన్నపిల్లల్లోనూ కరోనా వ్యాపిస్తోంది.

Corona on Children: చిన్నారుల్లోనూ వేగంగా విస్తరిస్తున్న కరోనా.. ఉత్తరాఖండ్ లో పదిరోజుల్లో వెయ్యిమంది పిల్లలకు కోవిడ్!
Corona
Follow us
KVD Varma

|

Updated on: May 17, 2021 | 7:04 AM

Corona on Children: కరోనా రెండో వేవ్ ప్రమాదకరంగా పరిణమించింది. మొదటి వేవ్ తో పోలిస్తే మరణాల సంఖ్య ఎక్కువైంది. అలాగే..చిన్నవయసు వారికీ ఈ మహమ్మారి సోకుతోంది. చిన్నపిల్లల్లోనూ కరోనా వ్యాపిస్తోంది. చిన్నారులపై తీవ్ర ప్రభావం కరోనా చూపిస్తుందని ఇప్పటికే వైద్యనిపుణులు చెప్పారు. వారు చెప్పిన మాటలు నిజం అవుతున్నాయి. ఉత్తరాఖండ్ లో 10 రోజుల్లో 9 సంవత్సరాల లోపు పిల్లలు వెయ్యిమందికి కరోనా సోకినట్లు ఒక సర్వే చెబుతోంది. వీరిలో కొంతమంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్‌ 1- 15 తేదీల మధ్య 264 మంది చిన్నారులు కరోనా బారిన పడ్డారు. ఆ తరువాత ఈ సంఖ్య పెరిగింది. ఏప్రిల్‌ 16- 30 తేదీల్లో 1,053 మందికి కరోనా సోకగా..మే 1- 14 తేదీల మధ్య 1,618 మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇది చిన్నారులపై కొవిడ్‌ ప్రభావం అంతకంతకూ పెరుగుతోందనే విషయాన్ని సూచిస్తోంది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఒక్కటే కాదు.. దేశవ్యాప్తంగానూ చిన్నారుల్లో పాజిటివ్‌ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులపై వ్యాక్సిన్ల ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుతిచ్చింది. ఇప్పటికే అనేక సంస్థలు ఆరు నెలల చిన్నారుల నుంచి 18ఏళ్ల లోపు వారిపై జరుపుతున్న క్లినికల్‌ ట్రయల్స్‌ వివిధ దశల్లో ఉన్నాయి. రెండేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల లోపు వారిపై కొవాగ్జిన్‌ ప్రయోగాలకు భారత్‌ బయోటెక్‌కు అనుమతి లభించిన విషయం తెలిసిందే.

ఇతర దేశాల్లో  ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా లాంటి సంస్థలు కూడా పిల్లలపై టీకా ప్రయోగాలు చేస్తున్నాయి. 12-18 ఏళ్ల వారిపై మోడెర్నా టీకా ప్రయోగ ఫలితాలు త్వరలో రానున్నాయి. 2-11ఏళ్ల వారిపైనా ఈ సంస్థ క్లినికల్‌ ట్రయల్స్‌ చేయనుంది. ఇక ఫైజర్‌ సంస్థ 12ఏళ్ల పైబడిన వారి కోసం తయారు చేసి టీకాకు అమెరికా, కెనడా ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. త్వరలోనే ఈ సంస్థ నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య చిన్నారులపై కూడా పరీక్షలు జరపనుంది. వీటితో పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, నొవావాక్స్‌ కూడా పిల్లలపై ప్రయోగాలు వ్యాక్సిన్‌ ప్రయోగాలు చేస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకూ చిన్నారుల విషయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎటువంటి పరిస్థితిలోనూ పిల్లల విషయంలో అశ్రద్ధ పనిచేయదని వారంటున్నారు.

Also Read: Covid-19: కరోనా లక్షణాలు ఉండి.. నెగిటివ్ రిపోర్ట్ వస్తే.. ఏం చేయాలో తెలుసా..? ఎయిమ్స్ ఏం చెప్పిందంటే?

Coronavirus: మహారాష్ట్రలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..?