Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid-19: కరోనా లక్షణాలు ఉండి.. నెగిటివ్ రిపోర్ట్ వస్తే.. ఏం చేయాలో తెలుసా..? ఎయిమ్స్ ఏం చెప్పిందంటే?

AIIMS: దేశంలో కరోనా విజృంభిస్తోంది. నిత్యం వేలాది మంది మరణిస్తున్నారు. లక్షలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే లక్షణాలు ఉన్నప్పటికీ చాలా మంది కరోనా పరీక్షల్లో

Covid-19: కరోనా లక్షణాలు ఉండి.. నెగిటివ్ రిపోర్ట్ వస్తే.. ఏం చేయాలో తెలుసా..? ఎయిమ్స్ ఏం చెప్పిందంటే?
Coronavirus
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 17, 2021 | 6:03 AM

AIIMS: దేశంలో కరోనా విజృంభిస్తోంది. నిత్యం వేలాది మంది మరణిస్తున్నారు. లక్షలాది కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే లక్షణాలు ఉన్నప్పటికీ చాలా మంది కరోనా పరీక్షల్లో నెగిటివ్‌గా వస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు కీలక సూచనలు చేసింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నెగిటివ్‌ వచ్చినా శరీరంలో కరోనా లక్షణాలు కనిపిస్తే మరోసారి టెస్టు చేయించుకోవాలని ఎయిమ్స్‌ సూచించింది. జ్వరం, పొడిదగ్గు, అలసట, వాసన కోల్పోవడం, ఒళ్లు నొప్పులు, విరేచనాలు, గొంతు నొప్పి, తలనొప్పి, శరీరంపై దద్దుర్లు వంటివి వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండటం మంచిదని పేర్కొంది. కరోనా వచ్చినవారిలో ఇవి మొదటి సూచనలని, ఇప్పటివరకు వైరస్‌ సోకివారిలో 80 శాతం మందిలో ఈ తరహా లక్షణాలే కనిపించాయని ఎయిమ్స్‌ వైద్యుడు డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ పేర్కొన్నారు. కోవిడ్ -19 పాజిటివ్ పరీక్షించిన రోగులకు నిర్వహించిన “మెడికేషన్ అండ్ కేర్ ఇన్ హోమ్ ఐసోలేషన్” వెబ్‌నార్‌లో ఆయన మాట్లాడారు.

డాక్టర్ల సలహా మేరకు ఔషధాలను సరైన సమయంలో తీసుకోవాలని.. వాటి గురించి తెలుసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన 60 ఏళ్లు పైబడిన రోగులకు హైపర్‌టెన్షన్, డయాబెటిస్, హార్ట్ డిసీజ్, మూత్రపిండాలు , ఊపిరితిత్తులకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే.. వైద్యులను సంప్రదించాలని సూచించారు. మందులతో పాటు పరిశుభ్రత కూడా ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. అసలు తేలికపాటి లక్షణాలు కనిపించగానే ఐసోలేషన్‌లోకి వెళ్లడం ఉత్తమం అని పేర్కొన్నారు. అయితే కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని మందులను వేసుకుంటున్నారని అవి మంచిది కాదని తెలిపారు. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తతతో వ్యవహరించడం మంచిదని పేర్కొన్నారు.

Also Read:

CID Case: రఘురామకృష్ణంరాజు కాళ్లపై ఉన్న గాయాలకు ‘ఎడిమా’నే కారణం..! రిపోర్టులో..

china help to india చైనా నుంచి 3,600 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో ఢిల్లీ చేరిన అతి పెద్ద కార్గో విమానం , ఇక సాయం వడివడిగా !