Airtel offer: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. 5.5 కోట్ల మంది కస్టమర్లకు రీచార్జ్ ఉచితం.. వివరాలు..
Bharti Airtel offer: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది పేద కుటుంబా

Bharti Airtel offer: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. నిత్యం లక్షలాది కేసులు వెలుగులోకి వస్తుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది పేద కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉంది. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చాలా మంది మొబైల్ వినియోగదారులు తమ రీచార్జ్ ప్లాన్లను కొనసాగించలేకపోతున్నారు. ఈ తరుణంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహమ్మారి సమయంలో తమ నెట్‌వర్క్ కనెక్టివిటీని కొనసాగించేలా తక్కువ ఆదాయం కలిగిన 5.5 కోట్ల మంది వినియోగదారులకు ఉచితంగా రూ.49 ప్యాక్‌ను అందించనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ ఆదివారం ప్రకటించింది.
కోవిడ్-19 ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో తక్కువ ఆదాయం కలిగిన వినియోగదారులకు రూ.270 కోట్ల విలువైన ప్రయోజనాలు ఉపయోగపడతాయని టెలికం కంపెనీ పేర్కొంది. దీనికి అదనంగా రూ.79 రీచార్జ్ కూపన్ కొనుగోలు చేసిన వారికి ఇప్పుడు రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయని వెల్లడించింది. రెండు బెనిఫిట్స్ కూడా రాబోయే వారంలో ఎయిర్‌టెల్ ప్రీ-పెయిడ్ కస్టమర్లకు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఈ నిర్ణయంలో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తంగా 5.5 కోట్ల మంది కస్టమర్లకు లబ్ధిచేకూరనుంది. వీరిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని భారతీ ఎయిర్‌టెల్ తెలిపింది.
ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కోవిడ్-19 సహాయక కార్యక్రమాలను కూడా రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఆ మేరకు తక్కువ ఇన్‌కమ్ కలిగిన 55 మిలియన్ల మంది కస్టమర్లకు 49 రీచార్జ్ ప్యాక్ ఉచితంగా ప్రకిటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ప్లాన్ ద్వారా 28రోజుల వ్యాలిడిటీతోపాటు రూ.38 టాక్‌టైమ్, 100ఎంబీ డేటా లభించనుంది. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారుల మధ్య కనెక్టివిటీని కొనసాగించేందుకు.. అవసరమైనప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని పొందడానికి ఈ స్కీమ్ సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.
Also Read: