covaxin effective in neutralising variants.. వివిధ కోవిడ్ వేరియంట్లను సమర్థంగా అదుపు చేయగల కోవాగ్జిన్ , భారత్ బయోటెక్ వెల్లడి
ఇండియాలోనూ, బ్రిటన్ లోను వ్యాపించిన వివిధ కోవిడ్ వేరియంట్లను తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థంగా అదుపు చేయగలిగిందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. ఈ దేశాల్లో మొదట బీ.1.617, బీ 1.1.7 వేరియంట్లను గుర్తించామని...

ఇండియాలోనూ, బ్రిటన్ లోను వ్యాపించిన వివిధ కోవిడ్ వేరియంట్లను తమ కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థంగా అదుపు చేయగలిగిందని భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. ఈ దేశాల్లో మొదట బీ.1.617, బీ 1.1.7 వేరియంట్లను గుర్తించామని, వీటితో బాటు ఇతర వేరియంట్లపై కూడా ఈ వ్యాక్సిన్ తో టెస్ట్ చేసినప్పుడు వీటిని న్యూట్రలైజ్ (అదుపు) చేయగలగడంలో ఇది సఫలీకృతమైందని ఈ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ వేరియంట్ డీ 614 జీ తో పోల్చినప్పుడు బీ 1.617 శక్తి 1.95 వరకు తగ్గిన విషయాన్ని ఈ సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా వివరించారు. ఈ మేరకు క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే మెడికల్ జర్నల్ లో తమ అధ్యయనాన్ని ప్రచురించారు/. ఇది కొంతమేర తగ్గినప్పటికీ బీ.1617 వేరియంట్ కాన్ సెంట్రేషన్ లెవెల్స్ అనుకున్న లెవెల్ కన్నా ఉన్నప్పుడు అది సులభంగా న్యూట్రలైజ్ కాగలిగిందన్నారు. అంటే దాని సామర్థ్యం తగ్గిందని వివరించారు. మొదట యూకేలో కనుగొన్న బీ.1.1.7 కి, ఆ తరువాత వ్యాక్సిన్ స్ట్రెయిన్ డీ 614 జీ కి మధ్య ‘తటస్థీకరణ’ లో తేడా కనబడిందన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇన్స్ టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో కలిసి చేసిన స్టడీలో ఈ విషయాలు వెల్లడయ్యాయన్నారు.
ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న మూడు వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 18,22,20, 164 డోసులను ప్రజలకు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : Ward boy rapes Covid patient video: హాస్పిటల్ లో కరోనా పేషేంట్ పై వార్డ్ బాయ్ లైంగిక దాడి వైరల్ వీడియో..
Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).
Sonu Sood : తారాస్థాయికి సోనూ ఇమేజ్.. విలన్‌గా చూపించేందుకు భయపడుతున్న మేకర్స్! ..వీడియో