china help to india చైనా నుంచి 3,600 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో ఢిల్లీ చేరిన అతి పెద్ద కార్గో విమానం , ఇక సాయం వడివడిగా !
చైనా నుంచి మొదటిసారిగా ఇండియాకు అతి పెద్ద 'కోవిడ్ సాయం' అందింది. కోవిడ్ సంక్షోభంతో దేశం విలవిల్లాడుతున్నప్పుడు డ్రాగన్ కంట్రీ నుంచి 3,600 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరాయి..
చైనా నుంచి మొదటిసారిగా ఇండియాకు అతి పెద్ద ‘కోవిడ్ సాయం’ అందింది. కోవిడ్ సంక్షోభంతో దేశం విలవిల్లాడుతున్నప్పుడు డ్రాగన్ కంట్రీ నుంచి 3,600 ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయానికి చేరాయి.. దాదాపు 100 టన్నుల బరువైన ఈ కంసైన్మెంట్.ని .చైనా లోని హాంగ్ జౌ ఎయిర్ పోర్టు నుంచి ఈ భారీ విమానం మోసుకొచ్చింది. ఈ జంబో చార్థర్ సరిగ్గా 3 గంటల 10 నిముషాలకు ఇక్కడ చేరినట్టు ఈ రవాణాను పర్యవేక్షించిన బొలోర్ లాజిస్టిక్స్ ఇండియా నేషనల్ సేల్స్ హెడ్ జస్ ప్రీత్ సింగ్ వెల్లడించారు. ఇండియాలో ఈ కంపెనీ అతి పెద్ద రవాణా వ్యవహారాలను చూస్తుందని అంటున్నారు. బీజింగ్ లోని భారత రాయబార కార్యాలయంతో ఈ సంస్థ సమన్వయంగా పని చేస్తుంది. ఢిల్లీతో బాటు ఉత్తరాదిలో వివిధ నగరాలకు ఈ ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను ఇక రవాణా చేయనున్నారు. ఇటీవల చైనా అధ్యక్షుడు జీజిన్ పింగ్ ఇండియాకు తాము సాయం చేస్తామని హామీ ఇచ్చిన విషయం గమనార్హం. ఆయన ఆ ప్రకటన చేసిన వెంటనే ఆ దేశ విదేశాంగ మంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. భారత దేశానికి సాధ్యమైనంత త్వరగా ఆక్సిజన్ సిలిండర్లను, ఇతర కోవిద్ సంబంధ మందులను పంపుతామని ఆయన చెప్పారు. మన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తో ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా ఆయన.. ఈ హామీ ఇచ్చారు.
మరిన్ని చదవండి ఇక్కడ : కరోనాతో తండ్రి మృతి.. చితిలో దూకిన కుమార్తె వైరల్ అవుతున్న వీడియో ..: viral video.
Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).