Viral: బురదలో కూరుకుపోయిన గజరాజును ఎలా రక్షించారంటే ? అటవీ శాఖ ఐడియా అంటే అదేమరి !
బురదలో నిండా కూరుకుపోయి పైకి లేవలేక నానా పాట్లు పడుతున్న గజరాజును అటవీ శాఖ సిబ్బంది నేర్పుగా రక్షించారు. కర్నాటక లోని బందిపూర్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ లో ఓ ఏనుగు ఎలా పడిందోగానీ బురదలో పడిపోయింది...
బురదలో నిండా కూరుకుపోయి పైకి లేవలేక నానా పాట్లు పడుతున్న గజరాజును అటవీ శాఖ సిబ్బంది నేర్పుగా రక్షించారు. కర్నాటక లోని బందిపూర్ టైగర్ రిజర్వ్ నేషనల్ పార్క్ లో ఓ ఏనుగు ఎలా పడిందోగానీ బురదలో పడిపోయింది. భారీ శరీరం కారణంగా ఓ పట్టాన లేవలేక పోతున్న దాన్ని ఎలా సేవ్ చేయాలా అని ఈ శాఖ ఉద్యోగులు తెగ హైరానా పడ్డారు. తాము వెళ్లి ఆ మహా కాయాన్ని వెలికి తీయడం సాధ్యం కాదు.. పైగా అది బురద కూడా.. అయితే ఒకరికి ఓ ఐడియా తట్టింది. ఆ ఏనుగును రక్షించేందుకు ఓ జేసీబీనే తెప్పించారు. దాంతో చాకచక్యంగా ఆ ఆడ ఏనుగును సేవ్ చేయగలిగారు. డ్రైవర్ నేర్పుగా, ఓర్పుగా తన యంత్రంతో దాన్ని కాస్త పైకి లేపగలిగాడు. అంతే.. మొత్తానికి అది లేచి నిలబడి తన మానాన తాను చక్కాపోయింది. ఈ ఏనుగు రక్షా కార్యక్రమం తాలూకు వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
One female elephant, stuck in the fresh mud puddle in Moleyur range of Bandipur Tiger Reserve, rescued successfully.@ntca_india @ArvindLBJP @aranya_kfd @kudremukh_wild @brt_tiger @DharwadForest @nagaraholetr @moefcc pic.twitter.com/U4ZTvFzd1D
— Bandipur Tiger Reserve (@Bandipur_TR) May 16, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : కరోనాతో తండ్రి మృతి.. చితిలో దూకిన కుమార్తె వైరల్ అవుతున్న వీడియో ..: viral video.
Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).