మహిళలతో పోలిస్తే పురుషుల చర్మం చాలా కఠినం..! అందమైన ముఖ తేజస్సు కోసం వీటిని ఫాలోకండి..
Men Follow These Tips : పురుషుడి చర్మం మహిళల చర్మానికి భిన్నంగా ఉంటుంది. అతని సంరక్షణ విధానం కూడా భిన్నంగానే ఉంటుంది.
Men Follow These Tips : పురుషుడి చర్మం మహిళల చర్మానికి భిన్నంగా ఉంటుంది. అతని సంరక్షణ విధానం కూడా భిన్నంగానే ఉంటుంది. కనుక వేసవిలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పద్దతులు రెగ్యులర్‌గా పాటిస్తే మీరు యవ్వనంగా, రిఫ్రెష్ గా కనిపిస్తారు.
1. రోజ్ వాటర్ : చాలా మంది పురుషులు ముఖంపై శ్రద్ద చూపరు. దీంతో చర్మం జిడ్డుగా మారి కఠినంగా తయారవుతుంది. ఇలాంటి చర్మాన్ని మృదువుగా చేయడానికి రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై ఉన్న ధూళి, దుమ్మును సులభంగా తొలగిస్తుంది.
2. మాయిశ్చరైజర్ వాడాలి : మీ చర్మ రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ వాడండి. బయటికి వెళ్ళే ముందు, రాత్రి నిద్రపోయే ముందు కచ్చితంగా అప్లై చేయాలి.
3. సన్‌స్క్రీన్‌ను దగ్గర ఉంచండి: చర్మాన్ని వడదెబ్బ నుంచి రక్షించడానికి ఎండలో బయటకు వెళ్ళే ముందు ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ కచ్చితంగా వాడాలి.
4. తగినంత నిద్ర అవసరం: మంచి నిద్ర వల్ల శరీర ఆరోగ్యం, ముఖంలో తేజస్సు పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల అకాల వృద్ధాప్యం సమీపిస్తుంది. కనీసం 8 గంటల నిద్ర కచ్చితంగా అవసరం.
5. ఆహారంపై శ్రద్ధ : ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, రసాలు, పాలు మీ డైట్‌లో ఉండేవిధంగా చూసుకోండి.
6. ఇంటి నివారణలు: రోజూ పచ్చి పాలతో ముఖ ప్రక్షాళన చేసుకోండి. షేవింగ్ తరువాత, ఆలివ్ ఆయిల్ తో ముఖాన్ని 5 నిమిషాలు మసాజ్ చేయండి. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి సహాయపడుతుంది.
7. నీరు పుష్కలంగా త్రాగండి: ఆరోగ్యకరమైన చర్మం కోసం, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. రోజులో 8 నుంచి 10 గ్లాసుల నీరు త్రాగాలి. దీంతో శరీరంలోని అన్ని టాక్సిన్స్ తొలగిపోయి ముఖంపై గ్లో ఉంటుంది.
8. బాడీ వాష్: పురుషులు సబ్బుకు బదులు బాడీ వాష్ ను వాడాలి. ఎందుకంటే సబ్బులో సోడియం హైడ్రాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మాన్ని పాడు చేస్తుంది. బాడీ వాష్ ముఖం కఠినతను తొలగిస్తుంది. మృదువుగా చేస్తుంది.