మాపై రాకెట్లను ప్రయోగిస్తున్న హమాస్ ను వదలం, దాడులు కొనసాగిస్తాం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరిక
సుమారు వారం రోజులుగా తమపై రాకెట్లను ప్రయోగిస్తూ జన నష్టం కలుగజేస్తున్న హమాస్ ను వదలబోమని, తమ పౌరులను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు.....
సుమారు వారం రోజులుగా తమపై రాకెట్లను ప్రయోగిస్తూ జన నష్టం కలుగజేస్తున్న హమాస్ ను వదలబోమని, తమ పౌరులను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలన్నింటినీ తీసుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. గాజాపై దాడులు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన హెచ్చరించారు. ఈ పోరుకు కారణం తాము కాదని, హమాస్ ఉగ్రవాదులేనని ఆయన ఆరోపించారు. మేం ఇంకా ఈ ఆపరేషన్ మధ్య దశలోనే ఉన్నాం, ఇది పూర్తి కాలేదు, అవసరమైనంత కాలం ఈ పోరు కొనసాగుతూనే ఉంటుంది అని ఆయన టీవీ ప్రసంగంలో పేర్కొన్నారు. హమాస్ వర్గం తమ ప్రజలను చాటు చేసుకుని మా ప్రజలపై దాడులకు దిగుతోందని, కానీ తాము అలా కాక…ఉగ్రవాదులనే టార్గెట్ చేస్తున్నామని నెతన్యాహు చెప్పారు. అమాయక ప్రజలకు హాని కలగకుండా మేం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం… నేరుగా టెర్రరిస్టులపైనే ఎటాక్ చేస్తున్నాం అన్నారు. గాజా సిటీలో ఆదివారం ఉదయం హమాస్ చీఫ్ ఇంటిపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపింది. ఆ వెంటనే ఇందుకు ప్రతీకారంగా హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ పై రాకెట్లను ప్రయోగించారు. తాజాగా జరిగిన హింసలో నలుగురు పాలస్తీనియన్లు మరణించారు.
ఈ వారం రోజుల్లో జరిగిన హింసలో మృతి చెందిన వారి సంఖ్య 149 కి పెరిగింది. వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. పాలస్తీనా ప్రెసిడెంట్ అబ్బాస్..ఇజ్రాయెల్ పై పగ పెంచుకుంటున్నాడని, అసలు ఉభయ పక్షాలూ రాజీకి రావాలని ఐక్యరాజ్య సమితి కోరుతోంది. కానీ అబ్బాస్ మాత్రం తన ఉగ్రవాదులను ఉసిగొల్పుతూనే ఉన్నాడు. ఇజ్రాయెల్ అనుసరిస్తున్న ముస్లిం వ్యతిరేక ధోరణికి అడ్డుకట్ట వేయాలని అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాడు.
మరిన్ని చదవండి ఇక్కడ : 5 tigers and 1 monkey viral video :ఒకేసారి ఐదు పులుల్ని ముప్పతిప్పలు పెట్టిన వానరం..కోతి చేష్టలుకు అల్లాడిపోయిన పులులు.
సాయం పొందిన రియల్ హీరో..! ఆ అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు – సోను సూద్ :Sonu Sood video.