అమెరికాలోని హూస్టన్ లో ‘ఇండియా’ ! ఎనిమల్ షెల్టర్ కు తరలించిన అధికారులు , ఇంతకీ ఏమిటా కథ? ఎవరా ‘ ఇండియా ‘ ?
ఇన్నాళ్లూ కనిపించకుండా పోయిన బెంగాల్ టైగర్ 'ఇండియా' ఇప్పుడు కనిపించింది. భారత దేశం పేరున్న ఈ పులి అమెరికాలోని హూస్టన్ లో ఇళ్ల ముందు తచ్చాడుతూ కనిపించింది. తొమ్మిది నెలల వయసున్న దీని బరువు 175 పౌండ్లని...

ఇన్నాళ్లూ కనిపించకుండా పోయిన బెంగాల్ టైగర్ ‘ఇండియా’ ఇప్పుడు కనిపించింది. భారత దేశం పేరున్న ఈ పులి అమెరికాలోని హూస్టన్ లో ఇళ్ల ముందు తచ్చాడుతూ కనిపించింది. తొమ్మిది నెలల వయసున్న దీని బరువు 175 పౌండ్లని దీన్ని పట్టుకున్న అధికారులు తెలిపారు. ఈ పులిని సురక్షితంగా పట్టి ఎనిమల్ షెల్టర్ కి తరలించినట్టు వారు చెప్పారు. ఇది కనిపించడం లక్కీ అయిందని, ఎవరిమీదా దాడి చేయకమునుపే పట్టుకోగలిగామని వారు చెప్పారు. మనుషులకు మాలిమి అయినందున ఈ జంతువు ఎవరికీ హాని చేయలేదన్నారు. అయితే స్థానికులు మాత్రం భయపడి పోగా కొందరు గన్స్ ఎక్కుపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. అసలు ఇంతకీ దీని యజమాని 26 యేళ్ళున్న విక్టర్ హ్యూగో అనే వ్యక్తి అట.. ఇతగాడు దీన్ని ముద్దుగా పెంచుకుంటున్నాడట. హానికరమైన జంతువును పెంచుకుంటున్నందుకు. ఇలా రోడ్లమీద దీన్ని వదిలేసినందుకు అతనిపై పోలీసులు కేసు పెట్టారు. టెక్సాస్ చట్టాల ప్రకారం.. పులులు వంటి జంతువులను పెంచుకోవచ్చు..కానీ ఇందుకు రిజిస్ట్రేషన్ అవసరం. పైగా వాటిని విచ్చలవిడిగా వదిలేయరాదు. విక్టర్ ఓ రెండు కోతులను కూడా పెంచుకుంటున్నాడు. వాటి బరువు సుమారు 30 పౌండ్లు మాత్రమే ఉన్నందున ఇతనిపై పోలీసులు కేసు పెట్టలేదు. తన ‘ఇండియా’కనిపించినందుకు విక్టర్ హ్యూగో స్పందన మాత్రం తెలియలేదు.
HPD Major Offenders Commander Ron Borza is relieved “India” the ? is now safe: https://t.co/3w2CZznKu9 pic.twitter.com/RiNviPFzq3
— Houston Police (@houstonpolice) May 16, 2021
మరిన్ని చదవండి ఇక్కడ : 5 tigers and 1 monkey viral video :ఒకేసారి ఐదు పులుల్ని ముప్పతిప్పలు పెట్టిన వానరం..కోతి చేష్టలుకు అల్లాడిపోయిన పులులు.
సాయం పొందిన రియల్ హీరో..! ఆ అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు – సోను సూద్ :Sonu Sood video.