వేసవిలో నలుపు లేదా ముదురు రంగు దుస్తులు ధరించకూడదు..! ఎందుకో కారణాలు తెలుసుకోండి…?
Black Clothes Avoid : మే నెల కఠినమైన వేసవి అంటారు. ఈ కాలంలో నలుపు రంగు దుస్తులు, ముదురు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు.
Black Clothes Avoid : మే నెల కఠినమైన వేసవి అంటారు. ఈ కాలంలో నలుపు రంగు దుస్తులు, ముదురు రంగు దుస్తులు ధరించడం మంచిది కాదు. వేసవిలో మీరు నల్ల దుస్తులు ధరిస్తే వేడి వల్ల ఎక్కువ బాధపడతారు. అయితే వేసవిలో ఈ రంగు దుస్తులు ఎందుకు వేసుకోకూడదు.. దీని వెనుక ఖచ్చితమైన కారణం ఏమైనా ఉందా.. తెలుసుకోండి. నల్ల దుస్తులు తొందరగా వేడెక్కడానికి ప్రధాన కారణం ఈ రంగు వేడిని గ్రహించడం. వేసవిలో నల్ల దుస్తులు ధరించిన తరువాత వాటిపై పడిన ఎండ త్వరగా ప్రతిబింబించదు. కనుక ఈ రంగు దుస్తులు చాలా వేడిగా అనిపిస్తాయి. ఈ కారణంగా వేసవిలో నల్ల దుస్తులు ధరించవద్దని సిఫార్సు చేయబడింది.
దీనికి విరుద్ధంగా వేసవిలో నూలు, లేత తెలుపు దుస్తులను ధరించడం మంచిది. తెలుపు వస్త్రం వేడిని తక్కువగా గ్రహించడం దీనికి కారణం. అంటే సూర్యరశ్మి తెలుపు లేదా లేత రంగు దుస్తులపై ఎక్కువసేపు ఉండదు. కనుక ఇది చాలా వేడిగా ఉండదు. ఫలితంగా ప్రజలు వేసవిలో తెల్లని దుస్తులను ఇష్టపడతారు. వేసవిలో సూర్యకాంతి తీవ్రత ఎక్కువ. తేలికపాటి దుస్తులు ధరించడం మంచిది. లేత రంగు దుస్తులను ధరించడం వల్ల సూర్యరశ్మి ఎక్కువగా నిలవదు. ఇది వేడికి సంబంధించిన అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. మరోవైపు చల్లని రోజు ముదురు రంగు దుస్తులను ధరించండి. చల్లని రోజులలో ముదురు రంగు దుస్తులు వేడిని గ్రహిస్తాయి. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. కనుక మీరు చలి నుంచి ఉపశమనం పొందుతారు. వేసవిలో మాత్రం కాటన్, షిఫాన్, జార్జెట్, క్రీప్ వంటి సన్నని, తేలికపాటి దుస్తులను ధరించండం మేలు.