Viral Video: భ‌లే.. భ‌లే.. ఏనుగులా మారిన కుక్కపిల్ల.. ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి

యానిమల్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ఆక‌ర్షిస్తాయి. ఇటువంటి ఫన్నీ వీడియోలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌ల్లో చాలాసార్లు వైర‌ల్ గా...

Viral Video: భ‌లే.. భ‌లే..  ఏనుగులా మారిన కుక్కపిల్ల.. ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి
Dog Cute Video

యానిమల్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా ఆక‌ర్షిస్తాయి. ఇటువంటి ఫన్నీ వీడియోలు ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌ల్లో చాలాసార్లు వైర‌ల్ గా మారుతుంటాయి. ట్విట్టర్‌లో ఖాతాలు ఉన్న కొంద‌రు వ్య‌క్తులు త‌మ‌ కుక్కలు, పిల్లుల‌ చాలా అందమైన వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అలాగే బ్యూటెంగేబీడెన్ అనే ఖాతా నుంచి తాజాగా పోస్ట్ చేయ‌బ‌డిన ఒక వీడియో తెగ వైర‌ల‌వుతుంది.

మేజిక్ ద్వారా కుక్క ఏనుగు అయింది…

సోషల్ మీడియా సైట్ ట్విట్టర్‌లో ఈ కుక్క వీడియో నెటిజ‌న్ల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. ఈ వీడియో 13 సెకన్ల నిడివి ఉంది. అందులో, ఒక కుక్కకు ఏనుగు ఆకారం అద్భుతంగా ఇవ్వబడింది. పైగా నా తొండం చూడండి..అన్నట్టుగా అది ఫోజోలిస్తోంది. కుక్కను ఏనుగుగా మార్చగల మాయాజాలం ఏమిటో మీరే చూడండి.

వీడియోలో క్యూట్ తెలుపు రంగు కుక్కపిల్ల ఉంది. య‌జ‌మాని దాని నోటికి పైప్ పెట్టిన‌ట్లు అర్థ‌మ‌వుతుంది. దీంతో ఆ క్యూట్ కుక్క పిల్ల కాస్తా ఏనుగు ఆకారాన్ని సంత‌రించుకుంది. ఈ క్యూట్ వీడియో మీకు కూడా న‌చ్చింది క‌దూ.. !

Also Read: ఏపీలో క‌ర్ఫ్యూ స‌మ‌యం మ‌రింత పెంచే అవ‌కాశం.. రేపు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం

 సిడ్నీ యూనివర్సిటీ కరోనాతో పోరాడుతున్న భారత్ కు సంఘీభావంగా మువ్వన్నెల వెలుగులు చిందించింది