Stay Strong India: సిడ్నీ యూనివర్సిటీ కరోనాతో పోరాడుతున్న భారత్ కు సంఘీభావంగా మువ్వన్నెల వెలుగులు చిందించింది
Stay Strong India: అత్యంత వేగంగా విరుచుకుపడుతున్నకరోనా వైరస్ రెండో వేవ్ పరిస్థితికి వ్యతిరేకంగా దేశం పోరాడుతున్న సమయంలో సిడ్నీలోని 'యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ` ఇండియాకు తన మద్దతు తెలిపింది.
Stay Strong India: అత్యంత వేగంగా విరుచుకుపడుతున్నకరోనా వైరస్ రెండో వేవ్ పరిస్థితికి వ్యతిరేకంగా దేశం పోరాడుతున్న సమయంలో సిడ్నీలోని ‘యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ `(యూఎన్ఎస్డబ్ల్యు) లైబ్రరీ భవనం భారతదేశం, భారత విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి సంఘీభావం తెలుపుతూ భారత త్రివర్ణంతో వెలుగులీనింది.
“సిడ్నీలోని యుఎన్‌ఎస్‌డబ్ల్యు లైబ్రరీ భవనం భారతదేశం, భారతీయ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి సంఘీభావం తెలుపుతుంది” అని ఆస్ట్రేలియా హై కమిషనర్ బారీ ఓ ఫారెల్ ఈ సందర్భంగా చెప్పారు. విశ్వవిద్యాలయం ప్రధాన లైబ్రరీ టవర్ యొక్క చిత్రాన్ని కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిలో భారత జెండాతో పాటు ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అనే సందేశం కూడా ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి.
“కరోనా మహమ్మారితో బాధపడుతున్న లేదా ప్రభావితమైన మా భారతీయ విద్యార్థులు, స్నేహితులకు (ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతరులకు) మద్దతుగా మేము మా ప్రధాన లైబ్రరీ టవర్‌ను ప్రకాశవంతంగా తీర్చి దిద్దాము. మీరందరూ సురక్షితంగా ఉండాలని, బాగానే ఉండాలని, బలంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము! “అని విశ్వవిద్యాలయం ఆ ట్వీట్ లో పేర్కొంది. యూఎన్ఎస్డబ్ల్యు ఒక ఆస్ట్రేలియన్ ప్రభుత్వ విశ్వవిద్యాలయం, సిడ్నీ శివారు కెన్సింగ్టన్లో అతిపెద్ద క్యాంపస్ ఈ విశ్వవిద్యాలయానికి ఉంది.
ఏఎన్ఐ చేసిన ట్వీట్..
Australia: University of New South Wales, Sydney illuminates its main library tower in support of “Indian students and friends”#COVID19 pic.twitter.com/4pg0V91jOT
— ANI (@ANI) May 14, 2021
ఇదిలా ఉండగా, భారతదేశం శుక్రవారం కరోనావైరస్ తొ 3.43 లక్షల కేసులు అలాగే 4,000 మరణాలను నమోదు చేసింది. దేశం లో ఇప్పటివరకూ నమోదైన మొత్తం 2,40,46,809 కేసులలో ఇప్పుడు 37,04,893 క్రియాశీల కేసులు, 2,00,79,599 రికవరీ కేసులు అలాగే 2,62,317 మరణాలు ఉన్నాయి.
మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశ పోరాటంలో మద్దతును ప్రదర్శించడానికి గత నెలలో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా త్రివర్ణంతో వెలిగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిడ్నీ యూనివర్సిటీ అదే పని చేసి భారత్ కు సంఘీభావం తెలిపింది.