మీడియాపై విరుచుకుపడిన లెజండరీ క్రికెటర్..! ఇండియాకు మద్దతు తెలిపిన ఆస్టేలియా మాజీ ప్లేయర్..

Matthew headen coments : కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ పోరాడుతుంటే పాశ్చాత్య మీడియా సంస్థలు ఇండియాను అవమానించడానికి,

మీడియాపై విరుచుకుపడిన లెజండరీ క్రికెటర్..! ఇండియాకు మద్దతు తెలిపిన ఆస్టేలియా మాజీ ప్లేయర్..
Matthew Headen Coments
Follow us
uppula Raju

|

Updated on: May 16, 2021 | 10:56 AM

Matthew headen coments : కరోనా సెకండ్ వేవ్‌తో భారత్ పోరాడుతుంటే పాశ్చాత్య మీడియా సంస్థలు ఇండియాను అవమానించడానికి, కించపరిచేలా ప్రచారం చేస్తున్నాయని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యుహెడెన్ ఆరోపించాడు. చైనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన భారత్ తప్పుడు సమాచార యుద్దాన్ని కూడా ఎదుర్కొంటుందన్నారు. ఇలాంటి సంక్షోభంలో ఇండియాకు ప్రపంచ దేశాలు మద్దతు పలకడం గర్వించదగ్గ విషయమన్నాడు. భారతదేశానికి సహాయపడేందుకు తాను ఎప్పుడు సిద్దమని తన మద్దతును ప్రకటించాడు. అంతర్జాతీయ మీడియా చేసిన తప్పులను చూపిస్తు తనదైన శైలిలో నిందించాడు.

ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా భారతదేశం కరోనా సెకండ్‌ వేవ్‌తో కట్టు మిట్టాడుతుందన్నాడు. భయంకరమైన వైరస్ ‌వ్యాప్తితో పోరాడుతున్నప్పుడు ప్రపంచ మీడియా భారత్‌కి మద్దతు పలకకుండా తన అక్కసును వెల్లగక్కిందన్నాడు. తాను ఒక దశాబ్దం పాటుగా భారతదేశాన్ని సందర్శిస్తున్నానని, దేశమంతటా పర్యటించానని తెలిపాడు. ముఖ్యంగా తమిళనాడు తన ” ఆధ్యాత్మిక గృహంగా “భావిస్తున్నట్లు ప్రకటించాడు. ఇంత వైవిధ్యమైన, విస్తారమైన దేశాన్ని నడిపించే నాయకులపై, ప్రభుత్వ అధికారులపై తనకు ఎప్పుడు గౌరవం ఉంటుందన్నాడు.

తాను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించారని, వారికి ఎల్లప్పుడు రుణపడి ఉంటానని చెప్పాడు. కొన్నేళ్లుగా తాను భారతదేశాన్ని దగ్గరగా చూస్తున్నానని, అందుకే అంతర్జాతీయ మీడియా చేస్తున్న ఆరోపణలకు తన రక్తం మరిగిపోతుందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా భారతదేశం ఎన్ని సవాళ్లను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. .

Viral News: పాము ఉంద‌న్న‌ స‌మాచారంతో టెర్ర‌స్ పైకి వెళ్లిన స్నేక్ క్యాచ‌ర్.. మైండ్ బ్లాంక్

Robbery In Hyderabad: హైద‌రాబాద్‌లో రెచ్చిపోయిన దొంగ‌లు.. ఐదు ఇళ్ల‌లో చోరీ.. భారీగా న‌గ‌దు, బంగారం అప‌హ‌ర‌ణ‌..

కొవిడ్‌ సమస్యలతో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతవ్ మృతి.. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు..

Vaccination: కరోనా టీకా కోసం కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా? పాజిటివ్ వస్తే  వ్యాక్సిన్ తీసుకోవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే