బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా..! అయితే తక్కువ కేలరీల ఆహారం తినండి.. అవేంటో తెలుసుకోండి..?
Lose Weight : ఆరోగ్యంగా ఉండటానికి ఒక వ్యక్తికి రోజుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో ప్రోటీన్
Lose Weight : ఆరోగ్యంగా ఉండటానికి ఒక వ్యక్తికి రోజుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. మీరు బరువు తగ్గాలనుకుంటే మీ ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల పరిమాణాన్ని పెంచండి. అధిక కేలరీలు బరువు తగ్గడానికి మీకు సహాయం చేయవు. అందువల్ల మీ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్, కేలరీలు తక్కువగా ఉండేవి విధంగా చూసుకోవాలి.
1. కాటేజ్ చీజ్ కేలరీలు తక్కువగా ఉంటాయి.100 గ్రాముల కాటేజ్ చీజ్‌లో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాల్షియం అధికంగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాటేజ్ చీజ్ ను మీ డైట్ లో చేర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇది మీ ఆకలిని శాంతపరచడానికి సహాయపడుతుంది. కండరాలను పెంచుతుంది.
2. పప్పుధాన్యాలు శాకాహారులకు పప్పుధాన్యాలే ప్రోటీన్‌కు మూలం. ఇవి ఉడికించడం సులభం అంతేకాకుండా చాలా రుచిగా ఉంటాయి. ఆహారంలో వివిధ పప్పులు తీసుకోవాలి. ఇందులో పోషకాలు, ప్రోటీన్లు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక కప్పు పప్పులో 18 గ్రాముల ప్రోటీన్, 16 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇది మీ కడుపు ఎక్కువసేపు నిండినట్లు చేస్తుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.
3. గుడ్లు గుడ్లలో చాలా పోషకాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది మీ శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. గుడ్డు పచ్చసొన తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. బచ్చలికూర, క్యాప్సికమ్, ఉల్లిపాయలు తినాలి.
4. మాంసం తినేవారికి చికెన్ మంచి ప్రోటీన్. 85 గ్రాముల చికెన్‌లో 20 గ్రాముల ప్రోటీన్, ఒక గ్రాము కొవ్వు ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ. దీన్ని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి ఉండదు. చికెన్ తయారుచేసేటప్పుడు సుగంధ ద్రవ్యాలు, నూనెకు బదులుగా ఎక్కువ కూరగాయలను వాడండి. అలాగే ఎల్లప్పుడూ తాజా చికెన్ తినండి. ప్రాసెస్ చేసిన చికెన్ ఆరోగ్యానికి హానికరం.