Covaxin: వ్యాక్సిన్‌పై వస్తోన్న అనుమానాలన్నీ పటాపంచలు.. కొత్త వేరియెంట్లను సైతం సమర్థంగా ఎదుర్కొంటున్న కోవాగ్జిన్..
Covaxin: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయపెడుతోంది. మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్ భారత్‌ను గడగడలాడిస్తోంది. రోజురోజుకీ పెరుగతోన్న కేసులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి...
Covaxin: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని భయపెడుతోంది. మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్ భారత్‌ను గడగడలాడిస్తోంది. రోజురోజుకీ పెరుగతోన్న కేసులు తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ ప్రక్రియ కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. అయితే ఈ మాయదారి వైరస్ రోజుకో రూపాన్ని మార్చుకుంటూ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం భారత్‌లో వైరస్ కొత్త రకం వేరియంట్ గందరగోళానికి గురి చేస్తోంది. దీంతో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిలో శరీరంలో ఈ కొత్త రకం వైరస్ ప్రవేశిస్తే.. వ్యాక్సిన్ పనిచేయదనే అనుమానాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈవార్తలన్నింటికీ చెక్ పడింది. కొత్త రకం వైరస్‌పై కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనిచేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌లో గుర్తించిన బి 1.617, యూకేలో గుర్తించిన బి 1.17 రకాల వైరస్‌లను కోవాగ్జిన్ నిర్వీర్యం చేస్తున్నట్లు గుర్తించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేసిన అధ్యయనంలో ఈ ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
Also Read: Covid-19 Tragedy: ఇంట్లో తండ్రి మృతదేహాం.. తల్లిని కాపాడుకునేందుకు క్యూ లైన్ లో యువకుడి ఆరాటం..
Pandemic Emotions: మరణం అంచున ఉన్న తల్లికోసం కొడుకు పాడిన ఆ పాట నెటిజన్ల హృదయాలు కదిలిస్తోంది!