Wedding: ఆదర్శ దంపతులు.. తక్కువ ఖర్చుతో పెళ్లి.. మిగిలిన రూ.37 లక్షలు విరాళమిచ్చిన జంట..
Tamil Nadu Couple: దేశంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తోంది. ఈ తరుణంలో నిరాడంభరంగా జరగాల్సిన శుభకార్యాలు.. చాలా సింపుల్‌గా ముగుస్తున్నాయి. లక్షలాది రూపాయాలు
Tamil Nadu Couple: దేశంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తోంది. ఈ తరుణంలో నిరాడంభరంగా జరగాల్సిన శుభకార్యాలు.. చాలా సింపుల్‌గా ముగుస్తున్నాయి. లక్షలాది రూపాయాలు ఖర్చు చేసి చేసే కుటుంబాలు.. సైతం కరోనా వ్యాప్తి, ఆంక్షలు ఉండటంతో తక్కువ ఖర్చుతో శుభకార్యాలను పూర్తిచేసుకుంటున్నారు. కొంతమంది మాత్రం తక్కువ మంది ఉన్నా ఎక్కువ ఖర్చు చేస్తున్నారు. ఇటీవల ఓ వివాహం విమానంలో జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కొంతమంది ఆదర్శంగా నిలుస్తున్నారు. తమిళనాడులోని ఓ జంట మాత్రం కరోనా సమయంలో తమ పెళ్లిని సింపుల్‌గా ముగించుకొని మిగిలిన డబ్బును కొవిడ్ సహాయ నిధికి ఇచ్చి ఆదర్శంగా నిలిచింది. తమిళనాడుకు చెందిన అను, అరుల్ ప్రాణేశ్ అనే వధూవరులు మొదట తమ పెళ్లికి రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ లాక్‌డౌన్ మధ్య ఈ నెల 14న జరిగిన వారి వివాహానికి రూ.13 లక్షలు మాత్రమే ఖర్చయ్యాయి.
దీంతో మిగిలిన రూ.37 లక్షలను రాష్ట్రంలో పలు ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందించారు. కొవిడ్ భయం కారణంగా చాలా మంది ఆహ్వానితులు రాలేదని, చివరికి ఫంక్షన్ హాల్ ఓనర్ కూడా తాము ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేశారని వరుడు అరుల్ ప్రాణేశ్ పేర్కొన్నాడు. అయితే.. ఈ పరిస్థితుల్లోనూ పెళ్లిని వాయిదా వేయకూడదని పెద్దలు నిర్ణయించారని.. దీంతో తాము వట్టమాలై అంగలమ్మన్ ఆలయంలో పెళ్లి చేసుకున్నట్లు వెల్లడించారు. స్థానిక అధికారుల అనుమతితో కరోనా నిబంధనలతో చాలా కొద్ది మంది సమక్షంలో పెళ్లి జరిగినట్లు తెలిపాడు. అయితే.. ఛారిటీ పని చేసే స్థానిక తిరుప్పూర్ వెస్ట్ రోటరీ క్లబ్‌లో తమ కుటుంబం చురుకుగా ఉండటంతో.. ఆ సంస్థకే మిగిలిన డబ్బును విరాళంగా ఇచ్చినట్లు తెలిపాడు.
Also Read: