Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ronaldo Wave: అడ్వర్టైజ్ మెంట్ రంగంలో రోనాల్డో వేవ్.. ఫుట్ బాల్ దిగ్గజ చర్యని వాడేస్తున్నారుగా..వాటే క్రియేటివిటీ!

Ronaldo Wave: ప్రపంచంలో అతివేగంగా ఏదైనా విషయం మీద స్పందించే రంగం ఉందీ అంటే అది అడ్వర్టైజ్ మెంట్ రంగం. స్పందించడం అంటే.. కష్టంలో ఉన్నవారి దగ్గరకు ఉరుక్కుని వచ్చి సాయం చేయడం అనుకునేరు.

Ronaldo Wave: అడ్వర్టైజ్ మెంట్ రంగంలో రోనాల్డో వేవ్.. ఫుట్ బాల్ దిగ్గజ చర్యని వాడేస్తున్నారుగా..వాటే క్రియేటివిటీ!
Ronaldo Wave
Follow us
KVD Varma

|

Updated on: Jun 18, 2021 | 6:19 PM

Ronaldo Wave: ప్రపంచంలో అతివేగంగా ఏదైనా విషయం మీద స్పందించే రంగం ఉందీ అంటే అది అడ్వర్టైజ్ మెంట్ రంగం. స్పందించడం అంటే.. కష్టంలో ఉన్నవారి దగ్గరకు ఉరుక్కుని వచ్చి సాయం చేయడం అనుకునేరు. అదికాదు. ఈ ప్రకటన రంగం పూర్తి వ్యాపారాత్మకం. చావు..పెళ్లి.. కరువు.. బరువు ఏదైనా కానీయండి ప్రజల్లోకి చొచ్చుకుపోయిందీ అంటే చాలు వ్యాపార ప్రకటనలను సిద్ధం చేసేవారికి పండగే. వెంటనే రంగంలోకి దిగిపోతారు. వారి క్రియేటివిటీకి పదును పెట్టేస్తారు. దానికి అసలు ఆలస్యం చేయరు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు, పోర్చుగల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో కోపం వల్ల కోకాకోలాకు భారీ నష్టాలు సంభవించాయి. ఈ సంఘటన తరువాత, యుఎస్ స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు 1.6% పడిపోయి, దాని విలువను సుమారు 30 వేల కోట్లు తగ్గించాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ, దీనిని క్యాష్ చేసుకోవడం ఎలానో మిగిలిన కంపెనీలకు తెల్సింది. మన భారతీయ కంపెనీలు తమ ప్రకటనల్లో ఎప్పుడూ సృజనాత్మకతకు పెద్ద పీట వేస్తాయి. ఇప్పుడు కూడా అదే జరిగింది. రోనాల్డో సంఘటనను మన కంపెనీలు తమ ప్రచారానికి సృజనాత్మకంగా వాడేస్తున్నారు. వీటిలో రెండు ప్రకటనలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అవేమిటో మీరూ చూడండి.. మనవాళ్ళ క్రియేటివిటీకి పడిపోతారు.

ఫెవికాల్..

ఈ కంపెనీ యాడ్ చూస్తే ఒక్కోసారి నవ్వు వస్తుంది. చాలాసార్లు భలే ఉందే అనిపిస్తుంది. ఎక్కువసార్లు ఎవరు క్రియేట్ చేశారోగానీ అని ఆలోచించేలా చేస్తుంది. అటువంటి మనల్ని ‘అతుక్కు’ పోయే యాడ్ లు చేయడంలో ఈ జిగురు కంపెనీ టాప్ ప్లేస్ లో ఉంటుంది ఎప్పుడు. ఇదిగో ఇప్పుడు కూడా రోనాల్డో కోపాన్ని.. తన యాడ్ గా సింపుల్ గా ఎలా మార్చేసిందో మీరూ చూడండి..

చూశారుగా.. శీతల పానీయాల ప్రపంచాన్ని వేడెక్కించిన చర్యను తనదైన ఫన్నీ స్టైల్ లో తన ప్రచారానికి ఎలా వాదేసుకుందో.. దీనికి ఇచ్చిన ట్యాగ్ లైన్ ఎంత చమత్కారంగా.. ఎవరికీ దొరక్కుండా ఎలా ఇచ్చారో చూడండి..”బాటిల్ తొలగించబడదు లేదా వాల్యుయేషన్ తగ్గదు ” అంతేనా.. సోషల్ మీడియా పోస్ట్‌లో, కోకాకోలా పేరు పెట్టకుండా, ‘హాయ్ నీ మై కోకా కోకా కోకా కోకా కోకా ….’ అని రాశారు. ప్రసిద్ధ హిందీ పాట యొక్క సాహిత్యం ఇవి. దీనితో పాటు, యూరో 2020 అనే హ్యాష్‌ట్యాగ్‌ను, అప్పుడు రొనాల్డో అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఇచ్చారు. అదీ క్రియేటివిటీ అంటే అని సోషల్ మీడియాలో ఈ ప్రకటనపై అభినందనలు కురుస్తున్నాయి. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అయింది.

అముల్..

అసలు అముల్ బేబీకి ఫ్యాన్స్ కానిది ఎవరు చెప్పండి.ముద్దుగా..ముచ్చటగా సమకాలీనాంశాలతో ప్రకటనలు రూపొందించడంలో అముల్ రూటే సపరేట్. హడావుడి లేకుండా అముల్ బేబీ తాను చెప్పాల్సింది చెప్పేసి.. అందంగా అందరినీ ఆకట్టేసుకుంటుంది. చిన్న చిన్న సంఘటనలే అముల్ వదలదు. మరి ఇంత మంచి అవకాశం వదిలేస్తుందా? నొ నెవర్.. మరి ఏం చేసిందో మీరూ చూడండి..

అదండీ అముల్ స్టైల్. చక్కగా ‘అముల్ బ్రాండ్ ఎప్పుడూ పక్కకు తప్పుకోలేదు’ అంటూ చల్లగా రెచ్చగోట్టేసింది. అంతేనా.. తరువాత ఒకరి భావాలను బాటిల్ చేయకూడదు! అంటూ పంచ్ ఇచ్చింది. ఇది కదా అమూల్ స్టైల్ పంచ్ అంటున్నారు అందరూ. సోషల్ మీడియాలో ఈ యాడ్ కూడా ఇప్పుడు పరుగులు తీస్తోంది.

ఇవే కాకుండా ఇంకా చాలా మంది తమ క్రియేటివిటీకి పని చెప్పారు. వాటిలో కొన్ని ఆక్ట్టుకునేవిధంగా ఉన్నాయి. పై రెండిటి తరువాత చెప్పుకోవాల్సిన కోట్ ఒకటి ‘ఆప్ స్టాక్స్’ ఇచ్చింది. ఈ స్టాక్ బ్రోకింగ్ యాప్ తన సోషల్ మీడియా పోస్ట్ లో ”స్టాక్ మార్కెట్లలో రోనాల్డో రిస్క్ లు ఉండొచ్చు.. మీ బ్రాండ్ ను జాగ్రత్తగా పెట్టండి” అంటూ అర్ధవంతంగా కోట్ చేసింది. ఇది కూడా సోషల్ మీడియాలో పాప్యులర్ అయింది. దానిని ఇక్కడ మీరు చూడొచ్చు..

ఇదీ రోనాల్డో చేసిన పని..

విలేకరుల సమావేశంలో జూన్ 15 న, రొనాల్డోకు కోపం వచ్చి, కోకాకోలా శీతల పానీయాల రెండు సీసాలను తన టేబుల్ నుండి తీసివేసి, నీరు త్రాగమని సలహా ఇచ్చాడు. హంగరీతో జరిగే మ్యాచ్‌కు ముందు ఆయన విలేకరుల సమావేశానికి వచ్చారు. ఈ సంఘటన తరువాత, యుఎస్ స్టాక్ మార్కెట్లో కోకాకోలా షేర్లు పడిపోయాయి. దీని కారణంగా దాని మార్కెట్ విలువ కూడా తగ్గింది. రొనాల్డో, 36, క్రమశిక్షణతో కూడిన ఆహారం కోసం ప్రసిద్ది చెందాడు. అతను ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి శీతల పానీయాలు మరియు ఎరేటెడ్ పానీయాల నుండి దూరంగా ఉంటాడు. విరాట్ కోహ్లీ నుండి అతని ఫిట్నెస్ డైట్ వరకు, ప్రపంచంలో ప్రసిద్ధ అథ్లెట్లు కూడా ఉన్నారు.

ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కూడా..

ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ పాల్ పోగ్బా కూడా విలేకరుల సమావేశంలో ఆల్కహాల్ లేని బీర్ హెనికెన్ ను తొలగించడం ద్వారా సంచలనం సృష్టించాడు. అయితే, హీనెకెన్ షేర్లు 1.7% పెరిగాయి. రెండు సంఘటనల తరువాత, హీనెకెన్, కోకాకోలా రెండు కంపెనీలు ఇది వ్యక్తిగత ప్రాధాన్యతతో కూడుకున్నదని చెప్పాయి. అంతేకాకుండా వాటిని గౌరవిస్తామని ప్రకటించాయి.

Also Read: Pullela Gopichand: ఇప్పుడు రోనాల్డో చేసిన పని ఇరవై ఏళ్ల క్రితమే మన పుల్లెల గోపీచంద్ చేశాడు..ఏమిటో తెలుసా?

Ronaldo on Coke: కోకాకోలా మీద రోనాల్డో ‘పెనాల్టీ’ కిక్.. దెబ్బకు కోక్ షేర్లు ఢమాల్! ఎంత నష్టమో తెలుసా?