Ronaldo on Coke: కోకాకోలా మీద రోనాల్డో ‘పెనాల్టీ’ కిక్.. దెబ్బకు కోక్ షేర్లు ఢమాల్! ఎంత నష్టమో తెలుసా?
Ronaldo on Coke: మనం సాధారణంగా వ్యాపార ప్రకటనలు చూస్తుంటాం. వాటితో కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తాయి. ఒక్క యాడ్ క్లిక్ అయితే, ఆ కంపెనీ ఉత్పత్తి అమ్మకాలు పెరుగుతాయి
Ronaldo on Coke: మనం సాధారణంగా వ్యాపార ప్రకటనలు చూస్తుంటాం. వాటితో కంపెనీలు తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి ప్రయత్నిస్తాయి. ఒక్క యాడ్ క్లిక్ అయితే, ఆ కంపెనీ ఉత్పత్తి అమ్మకాలు పెరుగుతాయి దానితో లాభాలు వస్తాయి అనేది మన అందరి అంచనా. అలాగే ఒక్కో కంపెనీకి ఒక్కో సెలబ్రిటీ తమ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడార్ గా పెట్టుకుంటుంది. వారితో ప్రచారం చేయిస్తే ఆ ఉత్పత్తులను ప్రజలు కొంటారనేది ఒక వ్యాపార వ్యూహం. నిజానికి ప్రకటనల వ్యాపారంతొ ఎంత మంచి జగుతుతుందో ఒక్కోసారి అంత చెడూ జరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో. ఎవరైనా ఒక సెలబ్రిటీ ఏదైనా ఒక ఉత్పత్తిని పక్కన పెట్టారు అనే విషయం తెలిసిందా..ఇక ఆబ్రాండ్ పరిస్థితి గందరగోళమే. ఏమిటీ అర్ధం కాలేదా? దీనినే ఇంకో రకంగా చెప్పుకుందాం.. ఒక సెలబ్రిటీ ఒక డ్రింక్ సీసాతో ఏదైనా పార్టీ.. ఈవెంట్ లో కనిపించాడనుకోండి అది ఆ బ్రాండ్ కి విపరీతమైన ప్రచారాన్ని తీసుకువస్తుంది. ఒకవేళ అదే సెలబ్రిటీ తన ఎదురుగా ఉన్న డ్రింక్ బాటిల్ ను పక్కకు తీసి పాడేశాడు అనుకోండి.. వెంటనె వ్యతిరేక ప్రభావం కనిపిస్తుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఆ కంపెనీ కోకా కోలా. సెలబ్రిటీ పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో. రోనాల్డో చేసిన ఒక్క చిన్న పనితో కోకాకోలా కంపెనీకి అక్షరాలా 29.34 వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అదీ కొద్ది గంటల్లో.. అసలేం జరిగింది? ఎందుకు ఇలా?
పోర్చుగల్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో యూరోకప్ లో తమ మొదటి పోటీ సందర్భంగా మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అప్పుడు ఆయన ముందున్న బల్ల మీద కోకాకోలా బాటిల్స్ ఉన్నాయి. వాటిని ఆయన తీసి పక్కన పెట్టేసి.. వాటర్ బాటిల్ ఆ స్థానంలో ఉంచారు. అంతేకాకుండా వాటర్ బాటిల్ పైకెత్తి చూపించి కోక్ వద్దు వాటర్ తాగండి అని చెప్పారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియో వైరల్ గామరిపోయింది. రోనాల్డో చేసిన పనిని అందరూ అభినందించారు. ఫాన్స్ అయితే, రోనాల్డో చేసిన పనితో ఆయన్ని ఆకాశానికి ఎత్తేసినంత పని చేస్తున్నారు.
ఆ వీడియో ఇక్కడ మీరు చూడండి..
?? Cristiano Ronaldo wasn’t pleased with the bottles of coke at his press conference and shouted ‘drink water!’…#POR | #CR7 pic.twitter.com/QwKeyKx2II
— The Sportsman (@TheSportsman) June 14, 2021
ఇదిలా ఉంటె.. రోనాల్డో చేసిన ఈ చిన్న చర్య ప్రభావం ఇప్పుడు కోకాకోలా కంపెనీ మీద గట్టిగా పడింది. యూరో కప్ కు కోకా కోలా అధికారిక స్పాన్సరర్. దీంతో రోనాల్డో ఎప్పుడైతే కోక్ పక్కన పెట్టేశారో వెంటనే కోకాకోలా కంపెనీ షేరు విలువ పడిపోయింది. ఆస్ట్రేలియన్ అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం అప్పటివరకూ స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్ ధర 56.10 డాలర్లు.. కాగ ఈ సంఘటన తరువాత 55.22 డాలర్లకు పడిపోయింది. అంటే 1.6% షేరు విలువ పతనం అయింది. దీని విలువ ఎంతో తెలుసా అక్షరాలా 29.34 వేల కోట్ల రూపాయలు.
రోనాల్డో..ఫిట్ నెస్ కింగ్..
36 ఏళ్ల రొనాల్డో ఆహార క్రమశిక్షణలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందారు. అతను ఆరోగ్యంగా ఉండటానికి శీతల పానీయాలు, ఏరేటెడ్ పానీయాల నుండి చాలా దూరంగా ఉంటాడు. అందుకే రోనాల్డో పుట్ బాల్ మైదానంలో చాలా చురకుగా ఉంటారు. ఆయనకె కాదు ఆయన డైట్ కి కూడా అభిమానులు ఉన్నారు. ప్రపంచంలోని ఎందరొ సెలబ్రిటీలు రోనాల్డో వీరాభిమానులు. వారిలో చాలా మంది ఆయన డైట్ కి కూడా పిచ్చ ఫ్యాన్స్.. అందులో మన క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఒకరు. అంతేకాదు ప్రపంచంలోని అథ్లెట్లలో ఎక్కువ మంది రోనాల్డో అభిమానులే!
Also Read: Cristiano Ronaldo: ఈ సాఫ్ట్ డ్రింక్ వద్దు.. మంచినీరు తాగండి..! క్రిస్టియానో రొనాల్డో సంచలన ప్రకటన..!