PF Customers Alert: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Jun 16, 2021 | 9:01 PM

పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగం కోల్పోయినా కోవిడ్ అడ్వాన్స్...

PF Customers Alert: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!
Epfo

Follow us on

పీఎఫ్ ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగం కోల్పోయినా కోవిడ్ అడ్వాన్స్ సర్వీసును వినియోగించుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈపీఎఫ్‌ఓ ప్రకారం, ఎవరైనా ఉద్యోగం పోగొట్టుకుని, ఇంకా మరే కంపెనీలో చేరకపోతే, పీఎఫ్ ఫండ్‌లో నుంచి కొంత భాగాన్ని కోవిడ్ అడ్వాన్స్‌గా ఉపసంహరించుకోవచ్చు. ఆ డబ్బును ఉద్యోగి మళ్లీ తిరిగి పీఎఫ్ ఖాతాలో జమ చేయాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఇలాంటి అడ్వాన్స్‌లను పొందేందుకు EPFO ​​నిర్దిష్ట నియమాలను రూపొందించింది. చందాదారులు బేసిక్ సాలరీ, భత్యాన్ని మూడు నెలలు లేదా ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తంలో 75 శాతం వరకు డబ్బును ఉపసంహరించుకోవచ్చు.

ఈ అడ్వాన్స్‌కు ఆదాయపు పన్ను వర్తించదు..

సాధారణంగా పీఎఫ్ బ్యాలెన్స్‌లో ఎంప్లాయ్ షేర్ కొంత భాగం, సంస్థ షేర్ కొంత భాగం ఉంటుంది. ఇదిలా ఉంటే పీఎఫ్ అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి, ఒక ఉద్యోగి తన ఫోన్ నుండి ఈపీఎఫ్ ఇండియా వెబ్‌సైట్ లేదా యూనిఫైడ్ పోర్టల్‌లో లాగిన్ కావాలి. మీరు ఆరోగ్యం లేదా ఇతర అవసరాల నిమిత్తం మీరు ముందుగానే పీఎఫ్ అడ్వాన్స్ తీసుకున్నా.. మరోసారి అడ్వాన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, ఈపీఎఫ్ పథకం కింద అడ్వాన్స్‌‌గా తీసుకునే సొమ్ముపై ఎలాంటి ఆదాయపు పన్ను వర్తించదని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.

KYC పూర్తి చేయాలి..

కేవైసీ పూర్తి చేస్తేనే.. మీ కోవిడ్ అడ్వాన్స్ పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. మీ యుఏఎన్ నెంబర్‌తో ఆధార్, కేవైసీ, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ అనుసంధానం అయితేనే కోవిడ్ అడ్వాన్స్ ప్రక్రియ పూర్తవుతుందని ఈపీఎఫ్ఓ తెలిపింది.

మూడు రోజుల్లో క్లెయిమ్..

ఇలాంటి కోవిడ్ అడ్వాన్స్ సెటిల్‌మెంట్స్ కోసం ఈపీఎఫ్ఓ ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్ విధానాన్ని అమలు చేసింది, KYC ప్రక్రియ పూర్తయిన దరఖాస్తుదారులు 3 రోజుల్లో క్లెయిమ్ పొందవచ్చు.

Also Read:

ఉదయాన్నే టిఫిన్ తిని స్నానం చేస్తున్నారా? అయితే జాగ్రత్త! ఈ విషయాలు తెలుసుకోండి

 కారు ఇంజిన్ నుంచి వింత శబ్దాలు.. బోనెట్ తెరిచి చూడగా ఫ్యూజులు ఔట్.!

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమిండియా జట్టు ఇదే.. ఆ ప్లేయర్‌కు మరోసారి నిరాశ.. కోహ్లీపై విమర్శలు.!

అత్తింటి మర్యాదా మజాకా.. కొత్త కోడలికి మెట్టు మెట్టుకో గిఫ్ట్‌.. వైరల్ అవుతున్న వీడియో..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu